భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని దక్కించుకుంది 777 ఛార్లి చిత్రం.
జూన్ 10వ తేదీన కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన మంచి కలెక్షన్లను రాబట్టింది.
ఇదిలా ఉంటే 777 ఛార్లి కన్నడ ఓటీటీ వెర్షన్ జూలైలోనే అందుబాటులోకి వచ్చింది.
అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో మాత్రం ఈ సినిమా ఓటీటీ వెర్షన్ అందుబాటులోకి రాలేదు.
దీంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు.
దీంతో ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ తెలుగు వెర్షన్ ఓటీటీ విడుదల తేదీని ప్రకటించింది.
అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 30 తేదీన విడుదల కానుంది.అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ అంది.
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్కైబర్లు అందరూ ఈసినిమా చూడలేరు.సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా మూవీ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.