భారతీయ సాంస్కృతిక సంపదకు నిలయమైన దేవాలయాల వెనుక దాగిన సైన్స్ ఎవరికీ అంతుచిక్కనిది.
ఎన్నో వేల, వందల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో కూడా దేవాలయాలను నిర్మించారు.
ప్రదేశాల అక్షాంశం, రేఖాంశాలను కొలవడానికి శాటిలైట్ టెక్నాలజీ లేని రోజుల్లో కూడా పర్ఫెక్ట్ గా 79 డిగ్రీల రేఖాంశం మీద 7 శైవ క్షేత్రాలను నిర్మించారు.
కేదార్‌నాథ్ ధామ్ కేదార్‌నాథ్ ఆలయం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. 79.0669 డిగ్రీల E రేఖాంశం
శ్రీకాళహస్తి ఆలయం తిరుపతికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం పంచభూతాలలో ఒకటి. 79.6983 డిగ్రీల E రేఖాంశం
ఏకాంబరేశ్వర ఆలయం కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. 79.4200 డిగ్రీల E రేఖాంశం
అరుణాచలేశ్వరాలయం తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో ఉన్న ఈ ఆలయం కూడా పంచభూత క్షేత్రాలలో ఒకటి. 79.0677 డిగ్రీల E రేఖాంశం
జంబుకేశ్వర ఆలయం పంచభూత క్షేత్రాలలో ఒకటైన జంబుకేశ్వర ఆలయం తమిళనాడులోని తిరుచ్చిలో ఉంది. 78.4220 డిగ్రీల E రేఖాంశం
తిల్లై నటరాజ ఆలయం నటరాజ స్వామి(శివుడు)కి అంకితం చేసిన ఈ ఆలయం తమిళనాడులోని చిదంబరంలో ఉంది. 79.6935 డిగ్రీల E రేఖాంశం
రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు స్థాపించారు. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. 79.3172 డిగ్రీల E రేఖాంశం
ఇక్కడ క్లిక్ చేయండి..