ఎయిర్‌పోర్టులు గోల్డ్‌ స్మగ్లింగ్‌కు అడ్డాలుగా మారుతున్నాయ్‌.

శంషాబాద్‌, చెన్నై, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ.. అన్ని ఎయిర్‌పోర్ట్స్‌లోనూ పెద్దఎత్తున గోల్డ్‌ స్మగ్లింగ్‌ జరుగుతోంది.

బంగారం అక్రమ రవాణాకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు స్మగ్లర్స్‌.

లేటెస్ట్‌గా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 61 కేజీల గోల్డ్ పట్టుబడింది.

 UAE నుంచి వచ్చిన నలుగురు, దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు ప్యాసింజర్స్‌ నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ఏడుగురు కూడా గోల్డ్‌ స్మగ్లింగ్‌కి చావు తెలివితేటలు ఉపయోగించారు. స్పెషల్‌గా బెల్ట్‌లు తయారు చేయించి బంగారం స్మగ్లింగ్‌కి ప్రయత్నించారు

పట్టుబడిన 61 కేజీల బంగారం విలువ 32 కోట్ల రూపాయలుంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. 

పట్టుబడిన ఏడుగురు ప్రయాణికుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

ముంబై కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు.