శాఖాహారమైనా లేదా మాంసాహారమైనా మంచి సువాసన కోసం బిర్యానీ ఆకు ఉపయోగిస్తారు
తక్కువ వంటకాల్లో దీనిని ఉపయోగించినప్పటికీ, భారతీయ వంటశాలలలో బిర్యానీ ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది.
సాధారణంగా బిర్యానీ ఆకుల వల్ల కలిగే 5 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం
బిర్యానీ ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
బిర్యానీ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రధానంగా 'కోలన్' క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
బిర్యానీ ఆకులు డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి.
బిర్యానీ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గాయాలలో, చుట్టుపక్కల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
బిర్యానీ ఆకులు కిడ్నీలో రాళ్లకు కారణమ అయ్యే యూరియాస్ అనే ఎంజైమ్‌ను శరీరంలో అధికంగా ఉత్పత్తి చేయడాన్ని నిరోధిస్తుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.