వేడి వాతావరణంలో పిల్లలు బయటికి వెళ్లి ఆడుకోవడం వల్ల డీహైడ్రేషన్, అలసటకు గురయ్యే ప్రమాదం ఎక్కువ.
ఈ వేసవి తాపంలో ఐదు డ్రింక్స్‌తో పిల్లలను హెల్దీగా, యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. మరి ఆ సమ్మర్ డ్రింక్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో కొబ్బరి నీరును పెద్దలతో పాటు పిల్లలు తప్పక తాగాలి. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
మండుతున్న ఎండల్లో పిల్లలు కోల్పోయే నీరు, ఖనిజాలను భర్తీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎండాకాలం మొత్తం రోజూ ఒక గ్లాసు నిమ్మరసం మీ పిల్లలతో తాగించడం చాలా మంచిది.
మండుతున్న ఎండల్లో పిల్లలు కోల్పోయే నీరు, ఖనిజాలను భర్తీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎండాకాలం మొత్తం రోజూ ఒక గ్లాసు నిమ్మరసం మీ పిల్లలతో తాగించడం చాలా మంచిది.
మజ్జిగలో కొత్తిమీర ఆకులు, చిటికెడు ఉప్పు, రుచి కోసం కాస్త జీలకర్ర, ఇంగువ వేయవచ్చు. అన్నింటినీ కలిపి పిల్లలకు మజ్జిగ ఇవ్వడం ద్వారా వారిలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది.
పుచ్చకాయలో పోషకాలు పుష్కలంగా ఉన్నందున వేసవిలో దీన్ని తరచుగా తినవచ్చు. నీటి శాతం కూడా అధికంగా గల పుచ్చకాయను మీ పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌లో లేదా చిరుతిండిగా చేర్చడం మంచిది.
సత్తు (Sattu) అనేది కాల్చిన సెనగ పప్పుతో చేసిన పానీయం. ఇది శరీరంలో చల్లదనాన్ని పెంచుతుంది. ఇందులో పుష్కలంగా ప్రోటీన్లు లభిస్తాయి.