భారత్ ఖాతాలో 4వ స్వర్ణం.. లాన్‌బౌల్‌లో సరికొత్త చరిత్ర
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నాలుగో స్వర్ణం సాధించింది.
లాన్ బౌల్స్ ఫైనల్లో భారత్ 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
92 ఏళ్ల కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత లాన్ బౌల్స్ మహిళల జట్టు పతకం సాధించింది.
ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణులు లవ్లీ చౌబే, పింకీ, నయన్‌మోని సైకియా, రూపా రాణి టిర్కీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
అంతకుముందు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది.
ఫైనల్‌లోకి ప్రవేశించడంతో లాన్ బౌల్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఎందుకంటే ఇప్పటివరకు లాన్ బౌల్‌లో భారతదేశం ఎటువంటి పతకం సాధించలేదు.