ఆరోగ్యకరమైన, అందమైన చర్మం కోసం ప్రతిరోజూ రసాయనాలు అధికంగా ఉండే ఫేస్ క్రీమ్స్, ఇతర లిక్విడ్స్ ఉపయోగిస్తుంటారు

ఇవి ఒక్కోసారి చర్మానికి హానీ కలిగించే ప్రమాదమూ ఉంది

అందుకే ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన చర్మ సౌందర్యం కోసం యోగా చేయాలని సూచిస్తున్నారు

ముఖ్యంగా మూడు రకాల ఆసనాలు అందాన్ని పెంచుతాయని చెబుతున్నారు. మరి ఆ మూడు రకాల యోగాసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

శీర్షాసనంలో తల కిందుగా ఉండాలి. ఒక చాప తీసుకుని, దానిపై తలకిందులుగా ఉండాలి. తల వెనుకవైపు చేతులు జోడించి ఉంచి.. కాళ్లను నిటారుగా పైకి పెట్టాలి. ఈ పొజిషన్‌లో కాసేపు ఉండి.. ఊపిరి పీలుస్తూ, వదులుతూ ఉండాలి

హలాసనం ఆసనం వేసే ముందు వెల్లకిలా పడుకోవాలి. అర చేతులను నేలకు స్పృశిస్తూ ఆ తరువాత పాదాలను నెమ్మదిగా పైకి లేపాలి. అలా పాదలను తల వెనుకవైపునకు తీసుకువచ్చి మీ ఛాతి మీ గడ్డానికి వీలైనంత దగ్గరగా తీసుకురావాలి. ఈ భంగిమలో కాసేపు ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి

సర్వంగాసనంలో ముందుగా వెల్లకిలా పడుకోని మీ పాదాలను నెమ్మదిగా పైకి లేపాలి. పాదాలు ఆకాశం వైపు చూసేలా ఉంచాలి. తుంటి భాగాన్ని సైతం పైకి లేపాలి. మీ అరచేతులతో సాయంతో నడుమును పైకి లేపినట్లుగా పట్టుకోవాలి. మీ భుజాలు, మొండెం, కటి, కాళ్లు సమలేఖంగా ఉంచేలా ప్రయత్నించాలి. మీ దృష్టిని పాదాలపై కేంద్రీకరించాలి. అలా ఉచ్చాశ్వ, నిశ్వాసలను సాగిస్తూ కాసేపు ఉండాలి