1998లో జనవరి 1వ తేదీన పవన్ కళ్యాణ్ ‘సుస్వాగతం’ మూవీ కొత్త సంవత్సరంకి స్వాగతం పలికేలా విడుదల చేశారు
ఈ మూవీతో పవన్ కళ్యాణ్ మంచి విజయాన్ని సాధించారు
భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు
ఆ రోజుల్లో ఈ సినిమా యువతకు ఓ సందేశంగా నిలచింది
ఈ సినిమాలో ముఖ్యపాత్రధారులు పవన్ కళ్యాణ్, దేవయాని, సాధిక, ప్రకాశ్ రాజ్, రఘువరన్, కరణ్, సుధాకర్, తిరుపతి ప్రకాశ్, బండ్ల గణేశ్, సుధ, వర్ష, వై.విజయ, పావలా శ్యామల, వేణు మాధవ్, నవీన్, మాధవిశ్రీ
ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ “నేను మోనార్క్ ని నన్నెవ్వరూ మోసం చేయలేరు…” అంటూ చెప్పిన డైలాగ్స్ మంచి ఆదరణ పొందాయి
ఈ చిత్రం విడుదలైన దాదాపు తొమ్మిదేళ్ళ తరవాత పవన్ కళ్యాణ్, భీమనేని శ్రీనివాసరావు, ఆర్.బి.చౌదరి కాంబినేషన్ లో ‘అన్నవరం’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు