మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ ర‌వితేజ హీరోలుగా వచ్చిన వాల్తేర్ వీర‌య్య సినిమా సంక్రాంతికి విడుదలై 230 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ వసూల్ చేసింది.

నందమూరి బాలకృష్ణ నటించిన వీర‌సింహారెడ్డి సంక్రాంతికి విడుదలై వంద కోట్ల‌కు పైగా వసూళ్లు రాబ‌ట్టింది

కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన మొదటి తెలుగు చిత్రం సార్. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ధనుష్ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

చిన్న సినిమాగా రిలీజ్ అయిన రైటర్ పద్మభూషణ్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం లో సుహాస్ హీరోగా నటించారు.

కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ హిట్ గా నిలిచింది. వరుస ప్లాప్ ల తరువాత కిరణ్ ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు.

కమెడియన్ వేణు వెల్డండి దర్శకుడిగా మరి తీసిన మొదటి చిత్రం ‘బలగం. చిన్న సినిమాగా ఎటువంటి పబ్లిసిటీ లేకుండా, విడుదల అయిన ఈ సినిమా మౌత్ టాక్ తో మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్‌ సినిమా దాస్ కా ధమ్కి. విశ్వక్ సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ గా నిలిచింది.

శ్రీకాంత్ ఓదెల తొలిసారి తెరకెక్కించిన దసరా చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇందులో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించారు.

సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

2016లో వచ్చిన బిచ్చగాడు మూవీ సీక్వెల్ గా వచ్చింది బిచ్చగాడు 2 . స్టార్టింగ్ లో మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ.. ఫైనల్ గా మూవీ హిట్ అయ్యింది.

యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో.. హీరోగా వచ్చిన చిత్రం మేమ్ ఫేమస్. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.