లేడీ యాంకర్లలో కెల్లా గ్లామర్ బ్యూటీగా చిన్నితెరపై రష్మీ హవా నడుస్తోంది.
జబర్దస్త్ వేదికపై తనదైన స్టైల్ హోస్టింగ్ చేస్తూ నవ్వుల రైడ్ లో భాగమవుతోంది.
ప్రతి ఎపిసోడ్ లో కూడా కొత్తగా కనిపించినేందుకు ప్రయత్నిస్తుంటుంది రష్మీ.
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ తో ఫుల్ పాపులర్ అయింది యాంకర్ రష్మీ.
ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా ఈ షోతోనే ఫేమస్ అయింది.
బుల్లితెరపై తెగ హంగామా చేస్తూ తన ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది రష్మీ గౌతమ్.
జబర్థస్త్ రేటింగ్ లో రష్మీ రోల్ కీలకం అని చెప్పుకోవచ్చు. ఇదే వేదికపై సుడిగాలి సుధీర్ తో ఆమె పండించిన రొమాన్స్ ప్రేక్షకులకు యమ కిక్కిచ్చింది.
తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా అడపా దడపా సినిమాలు చేస్తూ తగిన మోతాదుల్లో అందాల ఆరబోత చేస్తోంది.
కెరీర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్న రష్మీ గౌతమ్.. ఒక్కో షోకి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందట.
రీసెంట్ గా ‘బొమ్మ బ్లాక్ బాస్టర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం మరికొన్ని ఆఫర్లు కూడా రష్మీ చేతిలో ఉన్నాయని సమాచారం.