తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. పొడివాతావరణం నుంచి కాస్త కూల్‌గా మారుతూ వర్ష ప్రభావం కూడా పెరిగిపోతోంది. తెలంగాణలో అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 60మి.మీల వర్షం, నిజామాబాద్‌లో 54 మి.మీల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో ఎండ నుంచి కొంచెం ఉపశమనం పొంది కూల్ వాతావరణం కనిపిస్తూ అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఇక ఏపీలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్టణంలో 33మి.మీల వర్షపాతం నమోదైంది. రాయలసీమలో అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల మాత్రమే చిరు జల్లులు కురుస్తున్నాయి. చాలా వరకు పొడివాతావరణం కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు చూసుకుంటే, ఉత్తరప్రదేశ్‌లో సైక్లోనిక్ సర్క్యులేషన్ కొనసాగతుంది. దీంతో జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో సాధారణం నుంచి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా డెహ్రాడూన్‌లో 127మి.మీ వర్షపాతం నమోదైంది. పంజాబ్, హర్యానాలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో పొడివాతావరణం కనిపిస్తూ అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మోస్తారు నుంచి ఒకటి రెండు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
ఇక బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ కొనసాగుతోంది. దీంతో ఒడిశా, జార్ఖండ్‌లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తూ, కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కనిపిస్తుంది. ఇటు గుజరాత్ నుంచి కేరళ వరకు ఆఫ్ షోర్ ట్రఫ్ కొనసాగుతున్నందున గుజరాత్లో మంచి వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రను వర్ష గ్రహణం చాలా వరకు వదిలినట్లుగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో ప్రస్తుతం సాధారణం నుంచి ఒకటి నుంచి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముంబైలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కొంకణ్, గోవాలో ఇన్నాళ్లకు భారీ వర్షాలు తగ్గుముఖం పట్టి సాధారణ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక, కేరళలో మోస్తారు నుంచి భారీ కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. చెన్నైని మాత్రం వర్షం పగబట్టింది. చెన్నైలో చుక్క వాన కూడా లేదు.