డేంజ‌ర్ బెల్స్… తెలంగాణకు వర్ష సూచన

ప్ర‌స్తుత తెలంగాణ‌లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోన్న వేళ‌..మ‌రో షాకింగ్ విష‌యం చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించింది. తేలికపాటి జ‌ల్లుల‌ నుంచి ఓ మోస్తరు వ‌ర్షాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో న‌మోద‌య్యే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. కోమోరిన్ ఏరియా నుంచి రాయలసీమ వరకు 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ప్ర‌భావం క‌నిపిస్తోంది. మ‌రోవైపు సౌత్ మధ్య మహారాష్ట్ర, దాని రీజ‌న‌ల్ ఏరియాస్ […]

డేంజ‌ర్ బెల్స్... తెలంగాణకు వర్ష సూచన
Follow us

|

Updated on: Apr 04, 2020 | 9:28 AM

ప్ర‌స్తుత తెలంగాణ‌లో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోన్న వేళ‌..మ‌రో షాకింగ్ విష‌యం చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించింది. తేలికపాటి జ‌ల్లుల‌ నుంచి ఓ మోస్తరు వ‌ర్షాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో న‌మోద‌య్యే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. కోమోరిన్ ఏరియా నుంచి రాయలసీమ వరకు 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ప్ర‌భావం క‌నిపిస్తోంది. మ‌రోవైపు సౌత్ మధ్య మహారాష్ట్ర, దాని రీజ‌న‌ల్ ఏరియాస్ లో 1.5 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతాకవ‌ర‌ణ శాఖ‌ అధికారులు వెల్లడించారు. వీటి ప్ర‌భావంతో తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్ లోనూ ఆకాశం మేఘావృతమై ఉంది.

మ‌రోవైపు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. గత రెండు రోజులు గ‌రిష్ఠంగా 38.2 డిగ్రీలు, కనిష్టంగా 24.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ‌య్యాయి. వాతావరణశాఖ వ‌ర్షాల అంచనాతో ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పంటలు కూడా ప్ర‌స్తుతం ఉన్న లాక్ డౌన్ వ‌ల్ల అన్ని ప్రాంతాల్లో రైతుల చేతుల‌కు రాక‌పోవ‌డంతో..వారు తీవ్ర నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు.