హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిపోయిన వెదర్

హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలి దుమారంతో బెంబేలెత్తించింది. ఆ వెంటనే భారీ వర్షం కురిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, రాంనగర్, చిక్కడపల్లి, దోమలగూడ, లిబర్టీ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిపోయిన వెదర్
Follow us

|

Updated on: Sep 10, 2020 | 7:28 PM

హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలి దుమారంతో బెంబేలెత్తించింది. ఆ వెంటనే భారీ వర్షం కురిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, రాంనగర్, చిక్కడపల్లి, దోమలగూడ, లిబర్టీ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

అయితే.. కరోనా వైరస్ నేపథ్యంలో రోడ్లపై రద్దీ పెద్దగా ఉండకపోవడంతో ట్రాఫిక్‌కు పెద్దగా అంతరాయం ఏర్పడలేదు. అయితే కొన్ని చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఇక చార్మినార్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, చైతన్యపురి, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడాన వర్షం పడింది. గాలి దుమారానికి కొన్ని చోట్లు చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి.

గత వారం రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులు ఈ వర్షం  కొంత కూల్ చేసింది. అయితే వాతావరణం మరో మూడు రోజుల పాటు ఇలానే ఉంటుందని వాతారణ శాఖ వెల్లడించింది. శుక్రవారం కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని తెలిపింది. దక్షిణ దిక్కు నుంచి గాలులు వీయడం, ఎండ తీవ్రత వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు. వర్షంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు.