తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వానలు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 24 గంటల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ దాన్ని ఆనుకొని ఉన్న బీహార్ ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రాంతం నుంచి కోస్తాంధ్ర వర […]

తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వానలు
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 5:19 AM

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 24 గంటల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు ఉత్తర్‌ప్రదేశ్ దాన్ని ఆనుకొని ఉన్న బీహార్ ప్రాంతాల్లో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రాంతం నుంచి కోస్తాంధ్ర వర కు ఒడిశా మీదుగా ఉత్తర – దక్షిణ ద్రోణి కొనసాగుతోంది.

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24 గంటల్లో హైదరాబాద్ పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. బుధవారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొన్ని చోట్ల చిరుజల్లులు కురిశాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు రాజేంద్రనగర్‌లో 7.0 మిల్లీమీటర్లు, కొందుర్గులో 5.8 మి.మీ.లు, శంషాబాద్‌లో 3 మి.మీ.లు, శివరాంపల్లిలో 5 మి.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 31.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలు, గాలిలో తేమ 63శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్ల డించారు.