Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల స్ఫూర్తి మరువలేనిది"- కేంద్ర సహాయక హోంమంత్రి జి.కిషన్ రెడ్డి
  • చెన్నై : తమిళనాడు లో రుతుపవనాల ప్రభావం తో భారీ గా కురుస్తున్న వర్షాలు . తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాలతో పాటు వెల్లూర్ ,విరుదునగర్,నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . పలు చోట్ల రోడ్లన్నీ జలమయం ,ఉరుములు తో కూడిన వర్షాలకు పలు చోట్ల నేలకొరిగిన చెట్లు . తిరువళ్లూరు జిల్లాలో పిడుగుపాటు కి ఒక మహిళ మృతి.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయంలో కరోనా పాజిటివ్. దాదాపు 13 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

నాయీ బ్రాహ్మణులకు టీ సర్కార్ చేయూత

we will support the nayi brahmins, నాయీ బ్రాహ్మణులకు టీ సర్కార్ చేయూత

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని పలుమార్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి సంబంధించి ఏదో ఒకరకమైన ప్రభుత్వం పథకం విడుదల చేస్తూ..ఆయా వర్గాల ప్రజలకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పిస్తూ..వారిని అన్ని రకాలుగా ఆదుకుంటూనే ఉంది. కుమ్మరులు, కమ్మరులు మొదలు దేవుళ్లకు నిత్య పూజాది కైంకర్యాలు నిర్వహించే బ్రహ్మణుల వరకు ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని నాయీ బ్రాహ్మణులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.

బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు వినోద్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో నాయీ బ్రాహ్మణులు అన్ని రకాలుగా నష్టపోయిన విషయాన్ని సంఘం నాయకులు వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. లాక్‌డౌన్ తో ఆర్థికంగా నష్టపోయిన నాయీ బ్రాహ్మణులను ఆదుకోవాలని, విద్యుత్ రాయితీలు కల్పించాలని, పని ముట్లను అందించాలని సంఘ నాయకులు వినతి పత్రంలో కోరారు. వారి సమస్యల పట్ల వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంప్రదించి దశల వారీగా సమస్యలు పరిష్కరించనున్నట్లు హామీనిచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వినోద్ కుమార్ హామీనిచ్చారు.

Related Tags