కాంగ్రెస్‌ను ఖతం ఎలా చేస్తామంటే..!: కేసీఆర్

KCR slams Congress, కాంగ్రెస్‌ను ఖతం ఎలా చేస్తామంటే..!: కేసీఆర్

దుర్మార్గాలకు దేశంలో ఉన్న బ్రీడింగ్ సెంటర్ కాంగ్రెస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. మా దగ్గర ఇంకో రెండు, మూడు స్కీములు ఉన్నాయని.. వాటిని ప్రవేశపెడితే కాంగ్రెస్ పని ఖతమేనని కేసీఆర్ అన్నారు. మరో రెండు టర్ములు టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వీఆర్వోలను తొలగించాల్సి వస్తే తొలగిస్తామని.. దేశం మొత్తం ఆశ్చర్యపోయే అద్భుతమైన రెవెన్యూ చట్టం తెస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ హయాంలో అప్పులేకుండా కట్టిన ప్రాజెక్ట్ ఒకటైనా ఉందానని ఆయన ప్రశ్నించారు. నీటి లభ్యత లేని ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు ఎలా కడతారని.. కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ చతికిలపడిందని ఆయన ఘాటుగా విమర్శించారు. దేశంలోని పేదరికానికి కాంగ్రెస్, బీజేపీనే కారణమని కేసీఆర్ అన్నారు. పదవులను చిత్తు కాగితాల్లా వదిలేసి తెలంగాణను తెచ్చామని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని.. రాష్ట్రాలకు ఉన్న హక్కులను కాంగ్రెస్ హరించిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని.. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రాంతీయ పార్టీలేనని కేసీఆర్ నొక్కి వక్కానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *