అమిత్‌షా చెప్పింది జరిగేనా ? ఆ నిబంధన ఆ రాష్ట్రానికే పరిమితమా?

దేశమంతటా ఎన్నార్సీని అమలు చేస్తామని స్పష్టం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా. 2019 ఎన్నికల్లో విజయం ఇవ్వడం ద్వారా దేశ ప్రజలు తమను ఎన్నార్సీ అమలును ఆమోదించారంటూ చెప్పారు. దేశంలో అక్రమ వలసదారులను ఏరివేసేందుకే ఎన్నార్సీని అమలు చేస్తున్నామని అమిత్‌షా చెబుతున్నారు. నిన్నటి వరకు అసోం రాష్ట్రాన్ని వణికించిన ఈ ఎన్నార్సీ ఇప్పుడు దేశమంతా అమలు చేస్తామనడంతో పరిస్థితులు ఏ మేరకు దారితీస్తాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఎన్నార్సీ అంటే ఏమిటీ? ఎన్నార్సీ అంటే నేషనల్ […]

అమిత్‌షా చెప్పింది జరిగేనా ?  ఆ నిబంధన  ఆ రాష్ట్రానికే పరిమితమా?
Follow us

| Edited By:

Updated on: Sep 19, 2019 | 4:37 AM

దేశమంతటా ఎన్నార్సీని అమలు చేస్తామని స్పష్టం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా. 2019 ఎన్నికల్లో విజయం ఇవ్వడం ద్వారా దేశ ప్రజలు తమను ఎన్నార్సీ అమలును ఆమోదించారంటూ చెప్పారు. దేశంలో అక్రమ వలసదారులను ఏరివేసేందుకే ఎన్నార్సీని అమలు చేస్తున్నామని అమిత్‌షా చెబుతున్నారు. నిన్నటి వరకు అసోం రాష్ట్రాన్ని వణికించిన ఈ ఎన్నార్సీ ఇప్పుడు దేశమంతా అమలు చేస్తామనడంతో పరిస్థితులు ఏ మేరకు దారితీస్తాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

అసలు ఎన్నార్సీ అంటే ఏమిటీ?

ఎన్నార్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ లేదా జాతీయ పౌర జాబితా. ఇది ఒక రకంగా జనాభా లెక్కలాంటిది. దీన్ని సేకరించడం ద్వారా ఇక్కడ స్ధానికులు ఎవరు? స్ధానికేతరులు ఎవరు? అనే విషయం స్పష్టంగా చెప్పబడుతుంది. వీరి మూలాలన్నీ వెలికి తీస్తారు. దానిని బట్టి వారు ఈ ప్రాంతానికి చెందినవారా? కాదా? అనే విషయంలో ఓ స్పష్టతకు వస్తారు. అదే సమయంలో దేశంలో స్వదేశీయులకు భద్రత కల్పించడం, అక్రమ చొరబాటు దారులను గుర్తించి వారిని వారి సొంతప్రాంతాలకు పంపడం కూడా ఇందులో భాగమే. చారిత్రాత్మక అసోం ఒప్పందంలో భాగంగా 1971 మార్చి 24 తర్వాత అసోంలోకి వచ్చిన వారంతా అక్రమ చొరబాటుదారులుగా గుర్తించాలి. ఇలా వచ్చిన వారిని వారి స్వస్థలాలకు పంపించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ బాధ్యత.

ఎన్నార్సీ ఎలా రూపొందింది ? దేశంలో మొట్టమొదటిసారిగ ఈ ఎన్నార్సీని అసోంలోనే అమలు చేశారు. దీని కోసం అసోంలో 32 కేంద్రాలతో పాటు ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించారు. దాదాపు 3.29 కోట్ల మంది ప్రజలు తమ వద్దనున్న పౌరసత్వ ఆధారాలను సమర్పించారు. దాని ఆధారంగా చాలామందిని ప్రభుత్వం వివరణ కోరింది. ఆ తరువాత 2.89 కోట్ల మందితో కూడిన తుది ముసాయిదా జాబితాను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. అయితే వీటిలో 40 లక్షల మందికి చోటు దక్కలేదు. వీరందరికీ తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు మళ్లీ అవకాశాన్ని కూడా ఇచ్చింది. అలా తగిన ఆధారాలతో తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోతే వారు అక్రమ చొరబాటుదారులుగా గుర్తింపు పొందుతారు.

అసలు ఎన్నార్సీ నేపథ్యం ఏమిటి ? 1896లో అసొంలో భయంకరమైన భూకంపం సంభవించింది. ఆసమయంలో అసొం జనాభా నాలుగింట ఒక వంతుకు తగ్గిపోయింది. వేలాది మంది ఈ భూకంపానికి ప్రాణాలు కోల్పోయారు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు రాలేదు. ఆదాయం బాగా తగ్గిపోయింది. ఈ కారణంతో అప్పటికే విపరీతమై జనాభా కలిగిన తూర్పు బెంగాల్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి బ్రిటీష్ ప్రభుత్వం వలసలను ప్రోత్సహించింది. మరోపక్క గ్రోమోర్‌ ఫుడ్ ఉద్యమం పేరుతో బెంగల్ ముస్లింలకు అసోంలో ఎక్కడికైనా వెళ్లేందుకు కుటుంబమంతటికీ ఒక గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు. దీంతో వారు అసోంలో ఏ ప్రాంతానికి వెళ్లినా వారికి భూమి కూడా ఇచ్చి వారి నివాసం ఏర్పరచేకునేలా చేశారు. ఈ కారణంగా 1911 జనాభా లెక్కల ప్రకారం తూర్పుబెంగాల్ ప్రజల సంఖ్య విపరీతంగా పెరిగింది. 1931 నాటికి పశ్చిమ, దక్షిణ అసోంలలో తూర్పు బెంగాల్ వలసదారుల బాగా అభివృద్ధి చెందారు. ఇక అప్పటినుంచి ఇటీవలి కాలం వరకు అసోంలో వలసలు విపరీతంగా పెరిగాయి.

చరిత్రాత్మక అసొం ఉద్యమం అసోంలో దరంగ్ నియోజకవర్గంలో 1978లో ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో 78 వేలమంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. వీరంతా అక్రమ చొరబాట్లు ద్వారా ఇక్కడ స్థిర నివాసం ఏర్పటు చేసుకున్నవారే. అయితే ప్రపంచంలోనే ఎన్నడూ జరగని విధంగా 1979నుంచి 1985 వరకు అక్రమ చొరబాట్లపై తీవ్రస్ధాయిలో ఉద్యమమే జరిగింది. ఈ కారణంగానే 1985 ఆగస్టు 15నాటికి అసోం ఒప్పందం జరిగింది. ఇప్పుడు మరోసారి బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదార్లపై ఎన్నార్సీ అమలు చేయడం ద్వారా అసోంలో నికరంగా ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలిసింది.

అసోం మాజీ సీఎం విమర్శలు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం తరుణ్‌గొగోయ్..ఎన్నార్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిజాబితాలో అనేకమంది హిందువులు సహా లక్షలాది మంది అసలైన భారతీయులు కూడా తమ పేర్లు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నార్సీ అమలు చేయడంలో జరిగిన లోపాలపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని గొగోయ్ డిమాండ్ చేశారు.

ఆరెస్సెస్ ఆగ్రహం అసోంలో జరిగిన జాతీయ పౌర జాబితాలో అధిక సంఖ్యలో హిందువుల పేర్లు మాయం కావడంపై ఆరెస్సెస్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అసలైన పౌరుల పేర్లు ఆ జాబితాలో కనిపించకుండా పోవడంపై లోపం ఎక్కడుందో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన మూడు రోజుల సమావేశాల్లో ఇదే అంశం ప్రధానంగా చర్చించారట.

దేశమంతా అమలు సాధ్యమేనా? ఇప్పటికే తల్లిపిల్లలను ఎన్నార్సీ వేరు చేసింది. స్వయంగా కార్గిల్ యుద్ధంలో పోరాడిన సైనికుడి పేరు లేదు. మరోవైపు పౌరులు కూడా తమ పేర్లు లేకపోవడంతో ఎంతో మానసిక క్షభకు గురువుతున్నారు. ఎంతో మంది ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. భారత్‌ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ ఎన్నార్సీని అమలుచేస్తామని అమిత్‌షా స్పష్టం చేయడంపై రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాబితా రూపొందించడం,దాన్ని సవరించడంలో లక్షల సంఖ్యలో పేర్లు కోల్పోయే అవకాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి కేంద్ర హోం మంత్రిగా అమిత్‌షా వ్యాఖ్యలు వివాదానికి కారణమవుతున్నాయి. కేవలం అసోం విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన అంశాన్ని మిగిలిన రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తారో చూడాల్సిందే.

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!