Andhra Pradesh Elections: ‘పంచాయతీ ఎన్నికలకు మేం సిద్ధం.. అయితే అన్ని చోట్లా పోటీ చేయం..’

Andhra Pradesh Elections: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. ఎన్నికలపై పార్టీల్లో భిన్న స్వరాలు..

Andhra Pradesh Elections: ‘పంచాయతీ ఎన్నికలకు మేం సిద్ధం.. అయితే అన్ని చోట్లా పోటీ చేయం..’
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 24, 2021 | 4:34 PM

Andhra Pradesh Elections: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. ఎన్నికలపై పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాలకు కాకుండా.. తాము బలంగా ఉన్న చోట మాత్రమే తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ప్రకటించారు.

కాగా, ఎన్నికల నిర్వహణపై రాష్ట్రంలో భిన్న స్వరాలు వినిపించడంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికలను పెట్టాలని కోరుకుంటున్నాయని అన్నారు. ఎన్నికల కమిషన్ ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేశాక దానికి కట్టుబడి అందరూ సహకరించాలన్నారు. కాగా ఎన్నికల నిర్వహణపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు. ఉద్యోగులు భయపడటంలో అర్థం లేదన్నారు. కరోనాను కేవలం ఒక కుంటి సాకుగా మాత్రమే చూపిస్తున్నాయని ఉద్యోగ సంఘాల తీరును రామకృష్ణ తప్పుపట్టారు.

ఇదిలాఉంటే, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుండే ప్రారంభం కానుంది. అయితే ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు.

Also read:

Spectators: క‌్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త‌… స్టేడియంలోకి ఆ మ్యాచ్ నుంచి ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి..?

Antarvedi Temple: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి నూతన రథం.. ట్రయల్ రన్‌లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు..

ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!
ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!
చేతులు, కాళ్ళలో కనిపించే ఈ లక్షణాలు మధుమేహానికి సంకేతం కావచ్చు!
చేతులు, కాళ్ళలో కనిపించే ఈ లక్షణాలు మధుమేహానికి సంకేతం కావచ్చు!
హైదరాబాద్ జెర్సీ చూస్తే జెర్రులు పాకాల్సిందే అంటోన్న ఫ్యాన్స్..
హైదరాబాద్ జెర్సీ చూస్తే జెర్రులు పాకాల్సిందే అంటోన్న ఫ్యాన్స్..
మీన రాశిలో రవి సంచారం.. నెల రోజులు ఆ రాశుల వారు జాగ్రత్త!
మీన రాశిలో రవి సంచారం.. నెల రోజులు ఆ రాశుల వారు జాగ్రత్త!
మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్.. ఆ పాన్ ఇండియా సినిమాలో..
మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్.. ఆ పాన్ ఇండియా సినిమాలో..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నల అనువాదంలో తప్పులతడికలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నల అనువాదంలో తప్పులతడికలు
కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు
కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు
లోక్ సభ ముంగిట ‘కారు’ బేజారు.. కేసీఆర్ మౌనం వెనుక అసలు మర్మమిదే!
లోక్ సభ ముంగిట ‘కారు’ బేజారు.. కేసీఆర్ మౌనం వెనుక అసలు మర్మమిదే!
3 టెస్ట్‌లు ఆడి రూ. 1 కోటి పట్టేశారుగా బ్రో..
3 టెస్ట్‌లు ఆడి రూ. 1 కోటి పట్టేశారుగా బ్రో..
అతను నన్ను చాలా వేధించాడు.. రాత్రిళ్ళు ఫోన్ చేసి..
అతను నన్ను చాలా వేధించాడు.. రాత్రిళ్ళు ఫోన్ చేసి..
ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!
ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
దోసెలో 8 బొద్దింకలను చూసి మహిళ ఫ్యూజులు ఔట్‌.! బొద్దింకల దోసనా.?
దోసెలో 8 బొద్దింకలను చూసి మహిళ ఫ్యూజులు ఔట్‌.! బొద్దింకల దోసనా.?
బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక
బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక
సమ్మర్ కోసం ఏసీలు కొంటున్నారా.? అయితే ఈ టిప్స్ మీ కోసమే.!
సమ్మర్ కోసం ఏసీలు కొంటున్నారా.? అయితే ఈ టిప్స్ మీ కోసమే.!
ఇక మరింత కఠినంగా కేవైసీ వెరిఫికేషన్‌కు మరో లేయర్!
ఇక మరింత కఠినంగా కేవైసీ వెరిఫికేషన్‌కు మరో లేయర్!
పీఎఫ్‌ క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా? ఈ తప్పులు చేస్తున్నారా?
పీఎఫ్‌ క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా? ఈ తప్పులు చేస్తున్నారా?
ఆ క్షణాలను ఎంజాయ్‌ చేయలేకపోయాను.! అందుకే అలా చేశాను.
ఆ క్షణాలను ఎంజాయ్‌ చేయలేకపోయాను.! అందుకే అలా చేశాను.
కొత్త కోడ్‌తో ఆర్టీఏకు కాసుల పంట.! తొలిరోజే భారీగా ఆదాయం
కొత్త కోడ్‌తో ఆర్టీఏకు కాసుల పంట.! తొలిరోజే భారీగా ఆదాయం