‘కరోనా అదుపునకు మేమేం చేశామో చూడండి…నిందలు తగవు’..చైనా

కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు తమ దేశం ఎలాంటి చర్యలు తీసుకుందో చూడాలని, అంతే తప్ప.. చైనీస్ వైరస్ అనో, వూహాన్ వైరస్ అనో ఆరోపించడం, వ్యాఖ్యానించడం సరి కాదని ఇండియాలోని

'కరోనా అదుపునకు మేమేం చేశామో చూడండి...నిందలు తగవు'..చైనా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 26, 2020 | 12:16 PM

కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు తమ దేశం ఎలాంటి చర్యలు తీసుకుందో చూడాలని, అంతే తప్ప.. చైనీస్ వైరస్ అనో, వూహాన్ వైరస్ అనో ఆరోపించడం, వ్యాఖ్యానించడం సరి కాదని ఇండియాలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి జీ రాంగ్ ఖండించారు. ఇలాంటి పదాలు వాడడం అనుచితమన్నారు. (అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేపనిగా చైనీస్ వైరస్ అని, వూహాన్ వైరస్ అని చైనాను దుయ్యబడుతున్న సంగతి తెలిసిందే). దీనిపై జీ రాంగ్ స్పందిస్తూ.. మా దేశ ప్రజలను విమర్శించే బదులు మేం ఎంత త్వరగా రెస్పాండ్ అయ్యామో అంతర్జాతీయ దేశాలు గమనించాలన్నారు. మేమేమీ దీన్ని క్రియేట్ చేయలేదు.. కావాలనే వ్యాప్తి చెందింపజేయలేదు అని చెప్పిన ఆయన.. అసలీ వైరస్ ఎక్కడ పుట్టిందన్నదానిపై శాస్త్రీయ పరిశోధనలు జరగాలని అన్నారు. కరోనా నివారణకు భారత్, చైనా దేశాలు రెండూ పరస్పరం సహకరించుకుంటున్నాయని, తమ దేశానికి ఇండియా వైద్య పరికరాలు, మాస్కులు పంపి సహాయం చేసిందని, ఇందుకు  ఈ దేశానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నామని జీ రాంగ్ పేర్కొన్నారు. కరోనాకు సంబంధించి చైనాలోని ఇతర ప్రాంతాలకు, వూహాన్ సిటీకి సంబంధం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసిందన్నారు. మానవాళి ఆరోగ్యానికి మా దేశ ప్రజలు  చేస్తున్న త్యాగనిరతిని ప్రపంచ దేశాలు గుర్తించాలని మేం కోరుతున్నాం అన్నారాయన. అసలు వూహాన్ నుంచే ఈ వైరస్ పుట్టిందని మేమే మొదట ప్రపంచ దేశాలకు తెలియజేశామని, జనవరి 3 నుంచే ఈ విషయంలో ఆయా దేశాలకు ఒక అవగాహన ఏర్పడిందని జీ రాంగ్ తెలిపారు.