మా ‘కొబ్బరిమట్ట’కు మీ ఆశీస్సులు కావాలి: సంపూ

We need Blessings, మా ‘కొబ్బరిమట్ట’కు మీ ఆశీస్సులు కావాలి: సంపూ

నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా నటిస్తోన్న చిత్రం ‘మ‌న్మ‌థుడు 2’. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 9న విడుదల చేయబోతోన్న విషయం తెలిసిందే. అయితే ‘మన్మథుడు 2’ విడుదలైన మరుసటి రోజే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేసిన ‘కొబ్బరిమట్ట’ చిత్రం విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు తన ట్విట్టర్‌లో ‘మన్మథుడు 2’ చిత్రయూనిట్ ఆశీస్సులు కోరారు.

‘‘మా కొబ్బరిమట్ట చిత్రాన్ని ఆగస్ట్ 10న విడుదల చేయబోతున్నాము. మాకు కింగ్ నాగార్జునగారి, దర్శకుడు రాహుల్‌గారి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌గారి మరియు వెన్నెల కిషోర్ అన్నగారి ఆశీస్సుల కావాలి. మీ సినిమా హౌస్‌ఫుల్స్ అయ్యి, టికెట్స్ దొరక్క మా సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. మీ సంపూర్ణేష్ బాబు..’’ అని సంపూర్ణేష్ బాబు చేసిన ట్వీట్‌కు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ‘తథాస్తు సంపూగారు.. ఆల్ ది బెస్ట్’ అంటూ రిప్లయ్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *