నేతలెవరో మాకు తెలుసు, అవగాహనలేమి తగదు, కపిల్ సిబల్ కు సల్మాన్ ఖుర్షీద్ కౌంటర్

కాంగ్రెస్ పార్టీలో  మళ్ళీ విధేయులకు, అసమ్మతీయులకు మధ్య  విభేదాలు మొదలయ్యాయి. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలమీద మరో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్..

  • Umakanth Rao
  • Publish Date - 9:24 pm, Wed, 18 November 20
నేతలెవరో మాకు తెలుసు, అవగాహనలేమి తగదు, కపిల్ సిబల్ కు సల్మాన్ ఖుర్షీద్ కౌంటర్

కాంగ్రెస్ పార్టీలో  మళ్ళీ విధేయులకు, అసమ్మతీయులకు మధ్య  విభేదాలు మొదలయ్యాయి. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలమీద మరో సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడాధ్వజ మెత్తారు. సోనియా గాంధీ, రాహుల్ పార్టీని నడిపిస్తున్నారని, అసలు ఒక పార్టీకి ఓ నాయకుడు లేదా నాయకురాలు ఉన్నారన్న విషయాన్ని మరిచిపోరాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారిపోతోందన్న విమర్శలను ఆయన ఖండించారు. తమకు నాయకులు  లేరని  భావిస్తే వారికి పార్టీ గురించి అవగాహనే ఉండదన్నారు. ఏ విమర్శ అయినా చేసినప్పుడు పూర్వాపరాలగురించి పరిశీలించాలని ఖుర్షీద్ సూచించారు. బీహార్ ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమిపై సిబల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఆయన కామెంట్ల మీద మరో సీనియర్ నేత చిదంబరం కూడా పరోక్షంగా దుయ్యబట్టారు.