అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయి: తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్

రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తెలంగాణ డైరెక్టర్ డా. శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణలో లాక్‌‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేశామని చెప్పారు. లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు తక్కువగా నమోదయ్యాయని ఆయన తెలిపారు.

అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయి: తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్
Follow us

|

Updated on: May 30, 2020 | 6:18 PM

తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తెలంగాణ డైరెక్టర్ డా. శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో లాక్‌‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేశామని చెప్పారు. లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయడం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు తక్కువగా నమోదయ్యాయని ఆయన తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో కొందరు వ్యక్తుల వల్ల అనేక కుటుంబాలు వైరస్‌బారిన పడ్డాయని చెప్పారు. నాలుగో విడత లాక్‌డౌన్ ప్రారంభం నుంచి రాష్ట్రంలో కొత్తగా 1,005 కేసులు వచ్చాయని చెప్పారు. వీటిలో 470 కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు.

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కొన్ని ప్రాంతాల్లో గత 15 రోజులుగా కేసులు పెరిగిపోయాయని డా. శ్రీనివాస్ తెలిపారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా తెలంగాణకు వస్తున్నవారిలో ఎక్కువ నమోదవుతున్నట్లు చెప్పారు.. లాక్‌డౌన్ సడలించిన తర్వాత కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. బయటకు వచ్చినప్పుడు ప్రజలు మూడు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. మాస్క్ లేకుండా బయటకు వెళ్తే ఫైన్ విధిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో కరోనా మరింతగా వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని.. ఆస్పత్రుల్లో జ్వరాలకు సంబంధించిన కేసుల డేటాను రెగ్యులర్‌గా పరిశీలిస్తున్నామని చెప్పారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్