కర్తార్‍పూర్ కారిడార్‍పై నిర్మాణాత్మక చర్చలు

భారత్‍కు చెందిన ప్రజలు వారం రోజుల పాటు కర్తార్‍పూర్ పుణ్యక్షేత్రాన్నిదర్శించడానికి రోజుకు 5,000 మంది భక్తులకు వీసా రహిత ప్రాప్యతను కల్పించాలని గురువారం భారత్ పాకిస్తాన్‍కు మొరపెట్టుకుంది. ఈ నిబంధన భారత్‍కు, భారత సంతతి ప్రజలకు వర్తిస్తుందని అని హోం శాఖ వ్యవహారాల జాయింట్ సెక్రటరీ ఎస్సిఎల్ దాస్ చెప్పారు. కర్తార్‍పూర్ కారిడార్‍పై చర్చించేందుకు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశం ముగిసిన తర్వాత కూడా ఈ నిబంధనను అమలు చేయాలని అన్నారు. సమావేశం తరువాత […]

కర్తార్‍పూర్ కారిడార్‍పై నిర్మాణాత్మక చర్చలు
Follow us

| Edited By:

Updated on: Mar 15, 2019 | 2:52 PM

భారత్‍కు చెందిన ప్రజలు వారం రోజుల పాటు కర్తార్‍పూర్ పుణ్యక్షేత్రాన్నిదర్శించడానికి రోజుకు 5,000 మంది భక్తులకు వీసా రహిత ప్రాప్యతను కల్పించాలని గురువారం భారత్ పాకిస్తాన్‍కు మొరపెట్టుకుంది. ఈ నిబంధన భారత్‍కు, భారత సంతతి ప్రజలకు వర్తిస్తుందని అని హోం శాఖ వ్యవహారాల జాయింట్ సెక్రటరీ ఎస్సిఎల్ దాస్ చెప్పారు. కర్తార్‍పూర్ కారిడార్‍పై చర్చించేందుకు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశం ముగిసిన తర్వాత కూడా ఈ నిబంధనను అమలు చేయాలని అన్నారు.

సమావేశం తరువాత ఉమ్మడి ప్రకటనలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ, “ఈ రెండు పొరుగు దేశాల‌వారు కర్తార్‍పూర్ కారిడార్ యొక్క వివిధ అంశాలపై “నిర్మాణాత్మక చర్చలు” జరిపారు మరియు ఈ ప్రాజెక్ట్ వేగంగా అమలు చేయడానికి అంగీకరించారు” అని తెలిపారు. ఈ చర్చలు ఏప్రిల్ 2 న వాగా వద్ద మరోసారి జరుగనున్నాయి.

కర్తార్‍పూర్ కారిడార్ విషయంలో ఇది ఖచ్చితంగా వీసా రహితంగా ఉండాలని “ఏవైనా అదనపు పత్రాలు లేదా విధానాల రూపంలో ఏదైనా అదనపు ఇబ్బందులు ఉండకూడదు.” అని తీర్మానించారని దాస్ తెలిపారు.

ఈ రెండు కారిడార్లతో సంబంధమున్న రెండు దేశాల మధ్య మొట్టమొదటి సమావేశం పంజాబ్‍లోని అటారి-వాగా సరిహద్దులో నిర్వహించబడింది. ఈ సమావేశంలో అధికారులు గురుద్వారా కర్తార్‍పూర్ సాహిబ్‍కు యాత్రికులను అనుమతించడానికి ముసాయిదా ఒప్పందాన్ని చర్చించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ దీపక్ మిట్టల్ ఈ సమావేశంలో పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంభాషణలు పునఃప్రారంభం కాలేదని వివరించారు. ఫిబ్రవరి 14 న జమ్మూకాశ్మీర్లోని పుల్వామా టెర్రర్ దాడి తరువాత భారతదేశం, పాకిస్థాన్ల మధ్య దెబ్బతిన్న సంబంధాల మధ్య ఈ అభివృద్ధి జరిగింది.

నవంబర్ 2018 లో, న్యూఢిల్లీ మరియు ఇస్లామాబాద్‍లలో కర్తార్‍పూర్ కారిడార్ ప్రాజెక్ట్ కోసం పునాది రాయిని ఏర్పాటు చేసింది. ఈ కర్తార్‍పూర్ కారిడార్ ప్రాజెక్ట్ పాకిస్థాన్‍లోని నార్వాల్ జిల్లా కర్తార్‍పూర్ ప్రాంతంలోని గురుద్వారా దర్బార్ సాహిబ్ ను‍ండి భారత పంజాబ్‍లోని డేరా బాబా నానక్ వరకు కలుపుతుంది. సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్, 1539 లో కార్తార్పూర్లో మరణించాడు. ఈ కారిడార్ భారతీయ సిక్కు భక్తులు వీసాలు లేకుండా ప్రయాణించటానికి అనుమతిస్తుంది.

జనవరిలో, భారత్ పాకిస్తాన్‍తో అంతర్జాతీయ సరిహద్దు వెంట కారిడార్ యొక్క క్రాసింగ్ పాయింట్ కోఆర్డినేట్లను భాగస్వామ్యం చేసింది మరియు చర్చలకు ఒక ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించింది. పాకిస్తాన్ ఒక అంగీకారాన్ని సంతరించునికోవాలన్న‌ ప్రాథమిక ప్రతిపాదనను తిరస్కరించినప్పటికీ, మార్చి 13 న భారతదేశానికి ప్రతినిధి బృందాన్ని పంపించాలని నిర్ణయించింది..