సైన్యాన్ని స్వలాభాల కోసం వినియోగించట్లేదు- నిర్మలా సీతారామన్‌

బెంగళూరు: రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మోదీ, బీజేపీ నాయకులు సైన్యాన్ని రాజకీయ పావుగా వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు దేశ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు.  ప్రధాని కానీ, తాను కానీ,  మరే ఇతర ఎన్డీయే నేతలకు సైనిక వ్యవహారాల్లో రాజకీయం చేసే ఆలోచన లేదని ఆమె  స్పష్టం చేశారు. సైన్యాన్నికి స్వేచ్ఛను ఇచ్చే విషయంలో  ఎలాంటి రాజకీయం లేదంటూ ఆమె వివరించారు. కొంత మంది విద్యావేత్తలతో, నిపుణులతో, యువకులతో నిర్వహించిన […]

సైన్యాన్ని స్వలాభాల కోసం వినియోగించట్లేదు- నిర్మలా సీతారామన్‌
Follow us

|

Updated on: Apr 15, 2019 | 7:26 AM

బెంగళూరు: రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మోదీ, బీజేపీ నాయకులు సైన్యాన్ని రాజకీయ పావుగా వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు దేశ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు.  ప్రధాని కానీ, తాను కానీ,  మరే ఇతర ఎన్డీయే నేతలకు సైనిక వ్యవహారాల్లో రాజకీయం చేసే ఆలోచన లేదని ఆమె  స్పష్టం చేశారు. సైన్యాన్నికి స్వేచ్ఛను ఇచ్చే విషయంలో  ఎలాంటి రాజకీయం లేదంటూ ఆమె వివరించారు. కొంత మంది విద్యావేత్తలతో, నిపుణులతో, యువకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ మేరకు వ్యాఖ్యానించారు. కాగా సైన్యాన్ని ఓట్లు దండుకోడానికి బీజేపీ వాడుకుంటుదంటూ కాంగ్రెస్ ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే . దీనిపై నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. 2008 జరిగిన ముంబై దాడులను ఎదుర్కోలేని యూపీఏ ప్రభుత్వం ఉన్నంత బలహీనంగా ఎన్డీయే ప్రభుత్వం లేదని తెలిపారు. ఫుల్వామా దాడి అనంతరం భారత్‌ ఎంత పటిష్ఠంగా సమస్యను ఎదుర్కొందో దేశం మొత్తం చూసిందని అన్నారు. తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న నిర్మలా… దేశ రక్షణలో బాధ్యతలను నిర్వర్తిస్తున్న సైన్యాన్ని ఏ విధంగా రాజకీయ స్వలాభాల కోసం వినియోగించుకోవడం లేదన్నారు.