కోవిడ్-19 తో మరణించాలన్నదే అమెరికన్ల ధ్యాస, జో బైడెన్ సెటైర్

కోవిడ్-19 తో సహజీవనం కన్నా దీనితో ఎలా మరణించడం అన్న విషయాన్ని అమెరికన్లు నేర్చుకుంటున్నారని అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అన్నారు. తన సొంత రాష్ట్రం డెలావర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఇలా వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ.. ఇటీవలి దేశ చరిత్రలో ఈ కరోనా పాండమిక్ అత్యంత పెద్దదిగా మారి ఇతర విషయాలన్నింటినీ ‘చిన్నదిగా ‘ చేసేసిందని పేర్కొన్నారు. అమెరికాలో 2 లక్షల 20 వేలమందికి పైగా కోవిడ్ రోగులు మరణించారని ఆయన […]

కోవిడ్-19 తో మరణించాలన్నదే అమెరికన్ల ధ్యాస, జో బైడెన్ సెటైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 24, 2020 | 7:55 PM

కోవిడ్-19 తో సహజీవనం కన్నా దీనితో ఎలా మరణించడం అన్న విషయాన్ని అమెరికన్లు నేర్చుకుంటున్నారని అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అన్నారు. తన సొంత రాష్ట్రం డెలావర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఇలా వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ.. ఇటీవలి దేశ చరిత్రలో ఈ కరోనా పాండమిక్ అత్యంత పెద్దదిగా మారి ఇతర విషయాలన్నింటినీ ‘చిన్నదిగా ‘ చేసేసిందని పేర్కొన్నారు. అమెరికాలో 2 లక్షల 20 వేలమందికి పైగా కోవిడ్ రోగులు మరణించారని ఆయన చెప్పారు. ఈ భయానక వైరస్ వ్యాప్తికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణమని బైడెన్ ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఇది తీవ్ర ప్రభావం చూపిందన్నారు. దీనిపై పోరాటానికి ట్రంప్ కు ఓ ప్రణాళిక అంటూ లేదని కూడా జో బైడెన్ విమర్శించారు. ఈ వైరస్ ని ఆయన చిన్నచూపు చూసి ఫలితం అనుభవించారని బైడెన్ అన్నారు.