మేమే వస్తున్నాం..స్వేచ్ఛ కల్పించండి: రాహుల్

Rahul gandhi Asks Space, మేమే వస్తున్నాం..స్వేచ్ఛ కల్పించండి: రాహుల్

జమ్మూ కశ్మీర్ అంశం చాపా కింద నీరులా మారింది. అధికార బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య 370 రద్దు ట్విట్టర్ వార్ గా సాగుతోంది. జమ్మూ కశ్మీర్ లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అది చూడాలనుకుంటే విపక్షాలు అక్కడ పర్యటించవచ్చని ట్విట్ చేశారు ఆ రాష్ట్ర గవర్నర్ మాలిక్. కావాలంటే రాహుల్ గాంధీ కోసం ఓ విమానం కూడా పంపుతామని అన్నారు. మాలిక్ కామెంట్స్ కు రాహుల్ కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్ పర్యటనలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం కల్పించాలని కోరారు. మీ ఆహ్వానం మేరకు తాను, విపక్ష ప్రతినిథి బృందం జమ్మూ కశ్మీర్, లడఖ్ పర్యటనకు సిద్దమని పెర్కొన్నారు. ఇందుకోసం తమకు ప్రత్యేక విమానం అవసరం లేదన్నారు రాహుల్. అయితే అక్కడ తాము స్వేచ్ఛగా పర్యటించి అక్కడి ప్రజలను కలుసుకునే అవకాశం ఇవ్వాలన్నారు. అలాగే నిర్భంధంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల నాయకులనూ, అక్కడ విధులు నిర్వహిస్తున్న జవాన్లను కలుసుకునే అవకాశం కల్పించాలని రాహుల్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *