తలాక్‌ బిల్లుకు దూరంగా టీఆర్ఎస్…

We are against to Triple talaq voting Says TRS MP Keshava Rao, తలాక్‌ బిల్లుకు దూరంగా టీఆర్ఎస్…

వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై సస్పెన్స్ కొనసాగుతోంది. లోక్‌సభలో బిల్లుకు ఆమోదం పొందినా.. ఇప్పుడు రాజ్యసభలో పాస్ కావడానికి ఎన్డీఏకి బలం లేకపోవడంతో.. ఏం జరుగుతోందోనన్న టెన్షన్ అందరిలో నెలకొంది. అయితే బిల్లు పాస్ కావడానికి 121 మంది ఎంపీల మద్దతు అవసరం. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా, ఎన్డీఏ బలం 104. అయితే వీరిలో జేడీయూ బిల్లును వ్యతిరేకిస్తోంది. జేడీయూకు సభలో ఆరుగురు ఎంపీలు ఉన్నారు. అయితే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ.. బీజేడీ, అన్నాడీఎంకే ఓటింగ్‌కు దూరంగా ఉంటామని వెల్లడించాయి. అయితే తాజాగా టీఆర్ఎస్ పార్టీ కూడా ఓటింగ్ సమయంలో దూరంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కేశవరావు ఈ విషయాన్ని తేల్చిచెప్పారు. బిల్లుపై ఇప్పటికే తమ వైఖరి ఎంటో చెప్పామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *