Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • తెలంగాణ బీజేపీ కార్యాలయానికి కరోనా ఎఫెక్ట్. కార్యాలయాన్ని సోమవారం వరకు మూసి ఉంచాలని నిర్ణయించిన రాష్ట్ర నాయకత్వం. జాతీయ పార్టీ కీలక నేతలు కరోనా బారిన పడటంతో రాష్ట్ర కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించ కూడదని నిర్ణయం.
  • అమరావతి : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం. 3రాజధాని అంశంపై హైకోర్టు విచారణ. రాజధాని తరలింపుపై స్టే ఇచ్చిన హైకోర్టు. గవర్నర్ గెజిట్ పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్ట్.
  • రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించిన హైకోర్టు. 10 రోజులపాటు స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతున్న హైకోర్టు. రెండు బిల్లులకు సంబంధించి ఇదివరకే గెజిట్‌ విడుదల. తదుపరి కార్యకలాపాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు.
  • సింగ‌ర్ స్మిత‌కు కోవిడ్ పాజిటివ్‌: పాప్ సింగ‌ర్ స్మిత‌కు కోవిడ్ పాజిటివ్‌. కోవిడ్్ ల‌క్ష‌ణాలు లేవ‌ని ట్వీట్‌. ఒళ్లు నొప్పులు ఉండ‌టంతో ఎందుకైనా మంచిద‌ని ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ట్టు వెల్ల‌డి. ఇంట్లో సేఫ్‌గానే ఉన్న‌ప్ప‌టికీ త‌మ‌కు క‌రోనా సోకింద‌న్న స్మిత‌. త్వ‌ర‌లో క‌రోనాను జ‌యించి ప్లాస్మా దానం చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ట్వీట్.
  • ఇవాళ యూపీఎస్సీ సివిల్స్-2019 ఫలితాలు వెలువడ్డాయి. సిద్ధిపేటకు చెందిన మంద మకరంద్ ఆలిండియా స్థాయిలో 110వ ర్యాంక్ సాధించాడు. మొత్తం 829 మంది సివిల్ సర్వీసులకు ఎంపికవగా, మకరంద్ మెరుగైన ర్యాంక్ అందుకున్నాడు. దీనిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన సిద్ధిపేట బిడ్డ మంద మకరంద్ కు హార్దిక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ ఖ్యాతిని దేశ స్థాయిలో నిలిపాడంటూ మకరంద్ ను అభినందించారు.
  • మరో మూడు కార్పొరేట్‌ ఆస్పత్రులకు కోవిడ్ సేవలు కట్...! హైదరాబాద్ లో కరోనా ట్రీట్ మెంట్ చేస్తున్న మరికొన్ని ఆస్పత్రులకు ఆరోగ్య నోటీసులు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం యాక్షన్ .

ట్రంప్ రాక.. కాంగ్రెస్ సెటైర్.. వెరైటీ యాడ్ !

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాను సందర్శించబోవడం, ఆయనకు 70 లక్షల మంది ప్రజలు ఘనంగా ఆహ్వానం పలకాలంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వడంపై కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ గా స్పందించింది.
Congress Satirical Advertisement, ట్రంప్ రాక.. కాంగ్రెస్ సెటైర్.. వెరైటీ యాడ్ !

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియాను సందర్శించబోవడం, ఆయనకు 70 లక్షల మంది ప్రజలు ఘనంగా ఆహ్వానం పలకాలంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వడంపై కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ గా స్పందించింది. ఈ పార్టీ సోషల్ మీడియా.. వెరైటీ యాడ్ ను ప్రచురించింది. డోనాల్డ్ ట్రంప్ ‘నాగరిక్ అభినందన్ సమితి’ పేరిట  పబ్లిష్ చేసిన ఈ యాడ్ లో.. ‘ట్రంప్ ను చూసి హర్షాతిరేకంతో చేతులు ఊపితే.. మీకు 69 లక్షల ఉద్యోగాలు మీకోసం రెడీగా ఉంటాయి.. ఇందుకు ‘రెమ్యునరేషన్’ ‘అచ్ఛే దిన్ ‘. డేట్, టైం.. అంటూ..ట్రంప్ వచ్ఛే తేదీని, సమయాన్ని ప్రచురించింది. ఇక ట్రంప్ విజిట్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరెన్ని గిమ్మిక్కులు చేస్తుందో చూడాలి.

Related Tags