Breaking News
  • భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌.భారత్‌లో నిన్న 54,736 కరోనా కేసులు నమోదు, 853 మంది మృతి దేశవ్యాప్తంగా 17,50,724కు చేరిన పాజిటివ్‌ కేసులు.భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో 37,364 మంది మృతి.5,67,730 యాక్టివ్‌ కేసులు, ఇప్పటి వరకు 11,45,630 మంది డిశ్చార్జ్.
  • నేడు తిరుమలలో పౌర్ణమి గరుడసేవ కరోనా నిబంధనల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా గరుడసేవ.
  • కేరళకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక.నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ.ఇడుక్కీ, కోజికోడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఐఎండీ.
  • నేడు ఈ-రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌.సైబర్‌ నేరగాళ్ల నుంచి మహిళల రక్షణ కోసం ఈ-రక్షాబంధన్‌.కార్యక్రమం మహిళలు, బాలికలకు అవగాహన కల్పించనున్న పోలీసులు.
  • ప.గో. నేటి నుంచి ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో దర్శనాలకు అనుమతి.పవిత్రోత్సవాల సందర్భంగా భక్తులకు అనుమతి ఇచ్చిన అధికారులు.పవిత్రోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 4 వరకు ఆర్జిత సేవలు రద్దు.
  • నేడు రాఖీ పౌర్ణమి ..టీవీ9 వీక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
  • అమెజాన్‌ అడవుల్లో అగ్నిప్రమాదాలు పెరగడంపై నిపుణుల.హెచ్చరికలు, అమెజాన్‌ అడవుల్లో అగ్నిప్రమాదాలు ఏడాది క్రితంతో పోల్చితే జూలైలో 28 శాతం పెరిగాయని ఓ సంస్థ వెల్లడి.ఆఫ్గనిస్తాన్‌: జలాలాబాద్‌ జైలు దగ్గర కారు బాంబు పేలుడు, ఒకరు మృతి, 18 మందికి గాయాలు.

ఎమ్మెల్యేల మధ్య వాటర్ వార్.. అసహనానికి గురైన మంత్రి..!

Water War Between MLAs in Ananthapur District, ఎమ్మెల్యేల మధ్య వాటర్ వార్.. అసహనానికి గురైన మంత్రి..!

అనంతపురం జిల్లాలో రాజకీయం అంటేనే కత్తిమీద సాము లాంటిది. ఇక్కడ రాజకీయ సమస్యలకు పరిష్కారం చేపట్టాలంటే.. అది అంత ఈజీ కాదు.ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటుంది. ఎదుట ఎవరు ఉన్నా సరే.. నేతల తీరు మాత్రం మారదు. ఈ విషయం వైసీపీ అనతికాలంలోనే అర్థమైంది. ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత.. జిల్లా అభివృద్ధి మీద మూడు రివ్యూలు జరిగాయి. ఇందులో ఒకటి జిల్లా మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో జరగగా.. మరొకటి మాజీ ఇన్‌ఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఇక మూడవది ప్రస్తుత ఇన్ ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఇలా ముచ్చటగా మూడు రివ్యూ మీటింగ్‌లు జరిగితే.. మూడు మీటింగుల్లోనూ సేమ్‌ సీన్ రిపీట్ అయ్యింది.

అంతకు ముందు జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో.. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా బిహేవ్ చేశారట. నీటి విషయంలో ఏ ఎమ్మెల్యే కూడా తగ్గడం లేదట. అనంతపురం జిల్లాకు ఉన్న నీటి వనరులు ముఖ్యమైనవి రెండు. అందులో ఒకటి తుంగభద్ర ఎగువ కాలువ అయిన HLC.. కాగా మరొకటి శ్రీశైలం బ్యాక్ వాటర్ మీదుగా ఏర్పాటైన హంద్రీనీవా ప్రాజెక్టు. ఈ రెండే జిల్లాకు ప్రధానమైన ఆధారం. అయితే ఇప్పుడు అన్నీ నియోజకవర్గాలకు నీరు కావాలంటూ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తుండటంతో.. అధిష్టానం తలపట్టుకుంటుందట.

ఇటీవలే కొత్తగా ఇంచార్జ్‌ బాధ్యతలు చేపట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ.. అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో ఓ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అయితే ఈ సమావేశంలో తమ నియోజకవర్గానికి నీళ్లు కావాలంటే.. తమ నియోజకవర్గానికి కావాలంటూ మైకు అందుకుని ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇచ్చారట ఎమ్మెల్యేలు. కాగా, జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ నేతలే కావడం విశేషం. కానీ నేతల మధ్య సరైన కోఆర్డినేషన్‌ లేకుండా.. ఎవరికి వారు నీటి గురించి డిమాండ్ చేయడంతో.. ఇంచార్జ్‌‌గా ఉన్న మంత్రి ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారట. ఎమ్మెల్యేల మధ్య అండర్‌ స్టాండింగ్‌ లేకపోవడంతో మంత్రి కొంత అసహనానికి గురయ్యారని స్థానిక నేతలు గుసగుసలాడుకుంటున్నారట. మొత్తానికి అనంతపురం ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.

Related Tags