చెన్నైకి తాగునీటి రైళ్లు…

Water train from Vellore arrives in Chennai, చెన్నైకి తాగునీటి రైళ్లు…

చెన్నై వాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. రైళ్లలో తాగునీటిని సరఫరా చేసి ప్రజల గొంతులు తడుపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జోలార్‌పేట నుంచి చెన్నైకి రైళ్ల ద్వారా తాగునీటి సరఫరా ప్రారంభమైంది. జోలార్‌పేట సమీపంలోని మేట్టుక్కెర కుప్పం ప్రాంతం నుంచి పార్సంపేట వరకు సుమారు 3.5 కిలోమీటర్ల భారీ పైపులు ఏర్పాటు చేశారు. అక్కడ రైలు వ్యాగన్లలోకి నీటిని నింపి అక్కడి నుంచి చెన్నైకు నీటిని తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇక రాజస్థాన్‌ నుంచి జోలార్‌పేటకు 50 వ్యాగన్లు ఉన్న రైలును తీసుకొచ్చారు. విద్యుత్ మోటర్ల సహాయంతో 50 వ్యాగన్ల నీటిని నింపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *