హైదరాబాద్‌లో 24 గంటలు నీటి సరఫరా బంద్.. ఎప్పుడు? ఎందుకు?

Water Supply Bandh For 24 Hours:హైదరాబాద్‌లో బుధవారం పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ జలమండలి అధికారులు వెల్లడించారు. నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్న కృష్ణా ఫేజ్3 పైపులైన్‌కు భారీగా లీకేజీలు ఏర్పడటంతో మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 29వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి 30వ తేదీ గురువారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం […]

హైదరాబాద్‌లో 24 గంటలు నీటి సరఫరా బంద్.. ఎప్పుడు? ఎందుకు?
Follow us

|

Updated on: Jan 27, 2020 | 11:23 AM

Water Supply Bandh For 24 Hours:హైదరాబాద్‌లో బుధవారం పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ జలమండలి అధికారులు వెల్లడించారు. నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్న కృష్ణా ఫేజ్3 పైపులైన్‌కు భారీగా లీకేజీలు ఏర్పడటంతో మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. 29వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి 30వ తేదీ గురువారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు ప్రకటించారు.

అంత‌రాయం క‌లిగే ప్రాంతాలు :

సాహెబ్ నగర్, ఆటో నగర్, వైశాలి నగర్, మీర్ పేట్, జల్ పల్లి, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రి పురం, బండ్లగూడ, బుద్వేల్, సులేమాన్ నగర్, హైదర్‌గూడ, గోల్డెన్ హైట్స్, గంధంగూడ, అళ్లబండ, భోజగుట్ట, ఆసిఫ్ నగర్, రెడ్ హిల్స్, షేక్ పేట్, ప్రశాసన్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగి, బోడుప్పల్, చెంగిచర్ల, ఫిర్జాదిగూడ, అల్వాల్, సైనిక్ పురి, లాలాపేట్, స్నేహపురికాలనీ, కైలాసగిరి రిజర్వాయర్ ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు జలమండలి అధికారులు స్పష్టం చేశారు.

అక్రమ కనెక్షన్లకు చెక్…

జలమండలి అనుమతి లేకుండా చాలామంది నీటిని సరఫరా చేస్తున్న పైపులైన్ ద్వారా అక్రమ నల్లా కనెక్షన్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇక వాటిపై యంత్రాంగం దృష్టి సారించింది. సంస్థ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగానే వచ్చే నెల ఫిబ్రవరి 21లోగా అక్రమ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలని.. లేకపోతే భారీ జరిమానా తప్పదని అధికారులు హెచ్చరించారు.