పోలీసులపై వాటర్ దాడి.. అమెరికాలో ఆగ్రహం

Water splashed by protestors on New York police caught-on-camera, పోలీసులపై వాటర్ దాడి.. అమెరికాలో ఆగ్రహం

పోలీసులంటే కొంతమందికి బొత్తిగా భయం ఉండదు. రక్షణగా నిలిచే ఖాకీలపై కనీసం గౌరవం కూడా చూపరు. ఇలాంటి పరిస్థితి ఇక్కడే కాదు.. అమెరికాలో కూడా ఉంది. స్ధానికంగా ఏదో ఒక విషయంలో ఆందోళన చేస్తున్న కొంతమంది  పోలీసులపైనే తిరగబడ్డారు. ఏకంగా వాటర్ డబ్బాలతో నీళ్లను గుమ్మరించారు. సాధారణంగా పోలీసులే వాటర్ క్యానన్లుప్రయోగించి అల్లర్ల చేసేవారిని చెదరగొడతారు. కానీ ఇక్కడ పోలీసులపైనే వాటర్ ప్రయోగించారు. ఈ ఘటనపై  అక్కడి ప్రజా ప్రతినిధులు తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి బుద్ది వచ్చేలా చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *