నిద్రాహారాలు మానేసి నీళ్ల కోసం ఫైటింగ్..

నిర్మల్ జిల్లా బైంసా పట్టణ ప్రజలు.. తాగునీటి కోసం అల్లాడుతున్నారు. నీటి కొరత ఎక్కువగా ఉండటంతో, ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటి కోసం ఫైటింగ్ చేసుకుంటున్నారు స్థానికులు. గుక్కెడు నీళ్ల కోసం.. నిద్రాహారాలు మాని బారులు తీరుతున్నారు. సుభాష్ నగర్, ఏపీ నగర్, శివాజీ నగర్, ప్రీప్రీ వంటి కాలనీల గురించి చెప్పనక్కర్లేదు. బైంసా మున్సిపాల్టీ కుళాయిలు పూర్తిగా వట్టిపోయాయి. చుక్క నీరు రాకపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ల […]

నిద్రాహారాలు మానేసి నీళ్ల కోసం ఫైటింగ్..
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 10:13 AM

నిర్మల్ జిల్లా బైంసా పట్టణ ప్రజలు.. తాగునీటి కోసం అల్లాడుతున్నారు. నీటి కొరత ఎక్కువగా ఉండటంతో, ట్యాంకర్ల ద్వారా వచ్చే నీటి కోసం ఫైటింగ్ చేసుకుంటున్నారు స్థానికులు. గుక్కెడు నీళ్ల కోసం.. నిద్రాహారాలు మాని బారులు తీరుతున్నారు. సుభాష్ నగర్, ఏపీ నగర్, శివాజీ నగర్, ప్రీప్రీ వంటి కాలనీల గురించి చెప్పనక్కర్లేదు.

బైంసా మున్సిపాల్టీ కుళాయిలు పూర్తిగా వట్టిపోయాయి. చుక్క నీరు రాకపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారని స్థానికులు చెబుతున్నమాట. ఈ నీళ్లు ఎటూ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల కొకసారి స్నానాలు చేసే పరిస్థితి నెలకొందని బావురుమంటున్నారు.