వానాకాలంలో నీటి ఎద్దడి.. నీటిని అడ్డంగా తోడేస్తున్న వాటర్ మాఫియా

Water mafia at Ameenpur in Hyderabad, వానాకాలంలో నీటి ఎద్దడి.. నీటిని అడ్డంగా తోడేస్తున్న  వాటర్ మాఫియా

తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో వర్షాకాలంలో నీటిఎద్దడి. ఇది వినడానికే వింతగా ఉందికదూ. అవును నిజమే.. వర్షాలు దండిగా కురిసినా, చెరువులన్నీ నీటితో కళకళలాడుతూ కనిపిస్తున్నా ప్రజలకు మాత్రం మంచినీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఇళ్లల్లో బోరు నీళ్లు కూడా రావడం లేదు. ఇష్టానుసారం బోర్లు తవ్వడంతో భూగర్భజలాలు పైకి రావడంలేదు. యధేచ్ఛగా బోర్లు వేసేసి నీటిని తోడేస్తూ వాల్టా చట్టానికి కొంతమంది వాటర్ ప్లాంట్‌ యజమానులు తూట్లు పొడుస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో నగర ప్రజలకు అందాల్సిన జాలలు అందడం లేదు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ఏరియాలో వాటర్ మాఫియా ఆగడాలను టీవీ9 నిఘా టీమ్ బట్టబయలు చేసింది.

కాసులకు కక్కుర్తిపడి భూగర్భ జలాలను అడ్డంగా దోచేస్తున్న కేటుగాళ్ల బాగోతాన్ని టీవీ9 బయటపెట్టింది. అమీన్‌పూర్ ఏరియాలో ఇంటి అవసరాల పేరుతో బోర్లకు పర్మిషన్లు సంపాదించి.. నీళ్ల వ్యాపారాన్ని సాగిస్తున్నారు నీటి దొంగలు. ఇదేమిటి అని ప్రశ్నించినవారిపై దాడులకు సైతం దిగుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గతంలో అమీన్‌పూర్ ఏరియాలో వంద అడుగులు తవ్వితే నీరు వచ్చేది. కానీ నీటిదొంగల పుణ్యమా అని విపరీతంగా బోర్లు తవ్వడంతో సాధారణ ప్రజలు వేసుకున్న బోర్లు ఎండిపోయాయి. దీంతో గతిలేని పరిస్థితిలో వారి వద్దే నీటిని కొనుక్కోవాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇదే విషయాన్ని అధికారుల వద్ద ప్రస్తావిస్తే అలాంటి సమాచారం లేదీ లేదని, ఒకవేళ ఫిర్యాదు అందితే విచారణ జరుతామంటూ బదులిస్తున్నారు అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *