ఇటలీలో అదరగొడుతోన్న బిగ్గెస్ట్ లైట్ ఫెస్టివల్

ఇటలీలోని బ్రిక్సెన్‌ లో 3వ వాటర్ లైట్ ఫెస్టివల్ కళ్లు మిరుమిట్లు గొలిపేలా సాగుతోంది. పర్వత నీటి ప్రాముఖ్యతను తెలిపేలా, మౌంటైన్ వాటర్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ లైట్ వాటర్ ఫెస్టివల్ చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఇరవై నాలుగు మంది కళాకారులు కనుల పండువగా ఈ వేడుకను తీర్చిదిద్దారు. లైట్స్, ఆర్ట్, వాటర్, ఇంకా పర్యావరణం కలగలిపి ఇటాలియన్ నగరాన్ని ఒక బహిరంగ గ్యాలరీగా మార్చేశారు. ఈ ఫెస్ట్ దేశీయంగానేకాదు, అంతర్జాతీయ టూరిస్టులను సైతం విపరీతంగా ఆకర్షిస్తోంది. మే 9వ తేదీన మొదలైన ఈ అంబరం 25వ తేదీ వరకూ కొనసాగుతుంది. ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు నీటి దీపకాంతులు వెదజల్లుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *