ఏపీలో తాగునీటి కేటాయింపులు.. ఏ టౌనుకు ఎంతంటే.. ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్ల నుంచి పలు నగరాలకు, పట్టణాలకు ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణాలు, నగరాలలో తాగునీటి ఎద్దడి రాకుండా ఈ కేటాయింపులు జరిపినట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ ప్రకారం 21 పట్టణాలు, నగరాలకు ఈ నీటి కేటాయింపులు వర్తిస్తాయి. ఏపీలో మొత్తం 50 పట్టణాలకు గాను మొత్తం రూ.5050 కోట్ల ఏఐఐబీ నిధులతో మంచి నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణానికి […]

ఏపీలో తాగునీటి కేటాయింపులు.. ఏ టౌనుకు ఎంతంటే.. ?
Follow us

|

Updated on: Sep 22, 2020 | 3:39 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ రిజర్వాయర్ల నుంచి పలు నగరాలకు, పట్టణాలకు ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణాలు, నగరాలలో తాగునీటి ఎద్దడి రాకుండా ఈ కేటాయింపులు జరిపినట్లు అధికార యంత్రాంగం చెబుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ ప్రకారం 21 పట్టణాలు, నగరాలకు ఈ నీటి కేటాయింపులు వర్తిస్తాయి.

ఏపీలో మొత్తం 50 పట్టణాలకు గాను మొత్తం రూ.5050 కోట్ల ఏఐఐబీ నిధులతో మంచి నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. 21 పట్టణాల మంచి నీటి అవసరాల కోసం 4.482 టీఎంసీల నీటి కేటాయింపులు జరిపారు. మహేంద్ర తనయ నుంచి పలాసకు, ఏలేరు కాల్వ నుంచి నర్సీపట్నం, గొల్లప్రోలు, ముమ్మిడివరం పట్టణాలకు నీటి సరఫరా చేయాలని తలపెట్టారు.

కృష్ణా నది నుంచి తిరువూరు, నందిగామ, ఉయ్యారు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలకు నీటి సరఫరా చేయాలని కార్యాచరణలో పేర్కొన్నారు. బుగ్గవాగు నుంచి మాచర్ల, పిడుగురాళ్లకు, జవహర్ కుడి కాల్వ నుంచి వినుకొండకు నీటి సరఫరాకు నిర్ణయించారు. రామతీర్ధం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి చీమకుర్తి, కనిగిరికి నీటి సరఫరా చేస్తారు. గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాజెక్టు నుంచి గిద్దలూరుకు, కేపీ కెనాల్ నుంచి నాయుడుపేట. సూళ్లురుపేటలకు నీటి సరఫరా చేస్తారు.

అక్కంపల్లి నుంచి మడకశిరకు, పీఏబీఆర్ నుంచి కళ్యాణ దుర్గానికి, బుక్కపట్నం చెరువు నుంచి పుట్టపర్తికి, గాజులదిన్నె నుంచి ఎమ్మిగనూరుకు నీటి కేటాయింపులు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేటాయింపులతో పట్టణాలలో తాగునీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వం స్థానిక అధికారులను ఆదేశించింది.