Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తెలంగాణలో ప్రజా ప్రతినిధులను వణికిస్తున్న కరోనా. ప్రగతి భవన్‌లో 30మందికిపైగా సిబ్బందికి కరోనా మరో 15రోజులపాటు ప్రగతి భవన్‌కు సీఎం దూరం. నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా- కోలుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు. యశోదలో చికత్స పొందుతున్న మహిళా ఎమ్మెల్యే. డిశ్చార్చి అయిన రాష్ట్ర హోంమంత్రి. హోం క్వారెంటైన్‌లోనే డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు. కరోనా వచ్చిన వెల్లడించని ఐదుగురికిపైగా ఎమ్మెల్యేలు. హోంక్వారైంట్‌న్‌లో చికిత్స.
  • దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 రికవరీ రేటు. 60.8శాతానికి చేరుకున్న కోలుకున్నవారి సంఖ్య. కోలుకున్నవారు 95.48శాతం, మృతుల శాతం 4.52.
  • కృష్ణా జిల్లా : కొల్లు రవీంద్రను వీడియో కాన్పిరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు‌ హాజరుపరిచిన పోలీసులు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇంటి నుంచే న్యాయమూర్తి కేసు విచారణ. కొనసాగుతున్న విచారణ. వీడియో కాన్పిరెన్స్ లో విచారణ అనంతరం న్యాయమూర్తి కొల్లు రవీంద్రకు రిమాండ్ విధించే అవకాశం.
  • నిర్మాత పోకూరి రామారావు ఈరోజు ఉదయం కరోన కారణంగా మృతి చెందారు. పోకూరి రామారావు పోకూరి బాబురావు సోదరుడు. ఈతరం ఫిలిమ్స్ లో ఎన్నో చిత్రాలు తీశారు.
  • ఇంజనీరింగ్ విద్యార్థిని అశ్లీల చిత్రాలు ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసిన విద్యార్థిని గుర్తించిన పోలీసులు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆ యువకుడికి వీడియోలు ఎలా వచ్చాయన్న కోణంలో విచారణ. ఆ యువకుడు మరికొంతమందికి వీడియోస్ షేర్ చేసినట్లు గుర్తించిన పోలీసులు. కేసులో కొనసాగుతున్న విచారణ
  • తెలంగాణ లో రికార్డు స్థాయిలో కేసులు. రాష్ట్రంలో 20 వేలు, హైదరాబాద్ లో 16 వేలు దాటిన పాజిటివ్ కేసులు. లక్ష దాటిన కరోనా టెస్టింగ్ లు. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 1892 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 20,462. జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క రోజు 1658 కేసులు. Ghmc లో 16, 219కు చేరుకున్న కేసులు. 283 కి చేరుకున్న కరోనా మరణాలు. చికిత్స పొందుతున్న వారు- 9984. డిశ్చార్జి అయిన వారు -10195.
  • జీవీకే కుంభకోణంపై ఈడీ ఆరా. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తమకివ్వాలని ఈడీ లేఖ. జీవీకే స్కాంపై ప్రాథమిక సాక్ష్యాలు సేకరిస్తున్న ఈడీ.

టీమిండియా క్రికెటర్ బుగ్గ గిల్లి పారిపోయిన క్యూట్ గర్ల్…

Yuzvendra Chahal grabs attention on TikTok yet again, టీమిండియా క్రికెటర్ బుగ్గ గిల్లి పారిపోయిన క్యూట్ గర్ల్…

కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచమంతా స్తంభించిపోయింది. సినిమా షూటింగ్స్‌తో పాటు క్రికెట్ టోర్నీలు కూడా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో వారంతా ఇప్పుడు ఇళ్లకే పరిమితమయ్యారు. మన టీమిండియా క్రికెటర్లలో కొందరు ఫ్యామిలీ మెంబర్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తుంటే, మరికొందరు తమకిష్టమైన వ్యాపకాలతో బిజీ అయిపోయారు. తాజాగా భారత స్టార్ బౌలర్​ యుజువేంద్ర చాహల్​ మాత్రం తనలోని యాక్టింగ్‌ని బయటకు చూపించాడు. సోషల్ మీడియాలో ఓ టిక్‌టాక్ వీడియోతో సందడి చేశాడు. దానికి ఇప్పుడు ఊహించని స్పందన వస్తోంది.

ఈ వీడియోలో చాహల్ ఓ అమ్మాయితో కలిసి నడిచుకుంటూ వెళ్తూ..మధ్యలో షూ లేస్ కట్టుకునేందుకు వంగుతాడు. అప్పుడే పక్కన ఉన్న అమ్మాయి చాహల్‌ని వెనక్కి వెళ్లి ఆటపట్టిస్తుంది. ఆమెను పట్టుకునేందుకు చాహల్ ట్రై చెయ్యగా…బుగ్గ గిల్లి అక్కడినుంచి పారిపోతుంది. ఈ వీడియోలోని అమ్మాయి కూడా క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. మరో వీడియోలో తనలో ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్‌ని కూడా ప్రదర్శించాడు ఈ క్రికెటర్.

కాగా చాహల్ సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉంటాడు. అతనికో యూట్యూబ్ చానల్ కూడా ఉంది. పలువురు సహచర క్రికెటర్లను సైతం అతడు ఇంటర్వూ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు చాహల్.

Related Tags