Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. 7 లక్షల 42 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా 22, 752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 482 మంది మృతి • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,64,944 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,56,830 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 20,642 గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,62,679 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఇప్పటి వరకు దేశంలో 1,04,73,771 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు
  • కరీంనగర్ జిల్లా ఆరవ విడత హరితహారంలో భాగంగా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మొక్కలు నాటిన మంత్రి కేటీఆర్..
  • అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. కరోనా నేపథ్యంలో 13 జిల్లాల్లో స్పెషల్‌ సబ్‌జైళ్లు ఏర్పాటు. 13 ప్రత్యేక జైళ్లు ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం. స్పెషల్‌ జైలుకు తరలించే విధంగా ఆదేశాలు. కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రొటోకాల్ పాటించనున్న సబ్‌జైళ్లు. కరోనా నెగెటివ్‌ ఖైదీని మాత్రమే సాధారణ జైలుకు తరలించేలా ఆదేశాలు. జైలు సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు.
  • జివికే గ్రూప్ ఫై ఈడి కేసు నమోదు . ముంబాయి ఎయిర్ పోర్ట్ అభివృధి పేరుతో 705 కోట్ల రూపాయల కుంభకోణం కు పాల్పడిన జీవీకే సంస్థ. మనీలాండరింగ్ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు . జి వి కృష్ణారెడ్డి, సంజీయిరెడ్డి లతో పాటు నిందితులకు ఈడీ నోటీసులు . 305 కోట్ల రూపాయల బదలాయియింపుల ఫై ఈడీ ఆరా . విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అనుమానాలు . జూన్ 27 న జీవీకే సంస్థ తో పాటు 13 మంది పై సీబీఐ కేసు నమోదు . గత వారంలో హైదరాబాద్ ,ముంబై లో నీ జీవీకే కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ.
  • పంచాయతీరాజ్ ఎల్ ఈ డీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ పేరు మార్పు. ప్రాజెక్టుకు "జగనన్న పల్లె వెలుగు" గా పేరు మార్చిన ప్రభుత్వం . ఆదేశాలు జారీ చేసిన పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ . ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కు ఆదేశం.
  • తెలంగాణ లో 27వేల మార్కు దాటిన కరోనా కేసులు. హైదరాబాద్ లో 20వేలకు చేరవలో కేసులు. రాష్ట్రంలో ఈరోజు కరోనా పాజిటివ్ కేసులు 1879. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 27612. జిహెచ్ఎంసి పరిధిలో -1422. Ghmc లో 12,633 కు చేరుకున్న కేసులు. ఈరోజు కరోనా తో 7 మృతి . 313కి చేరిన మరణాలు. చికిత్స పొందుతున్న వారు- 11,012. డిశ్చార్జి అయిన వారు -16287. ఈ రోజు వరకూ రాష్ట్రంలో టెస్టింగ్స్ 128438.
  • రెండో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు. భారీ బందోబస్తు మధ్య పనులు.. దారులన్నీ మూసివేత. ఇప్పటికే సీ, హెచ్, జీ బ్లాకులతో పాటు పాత భవనాలు నేలమట్టం. సమాంతరంగా ఇతర బ్లాకుల్లో కూల్చివేత పనులు. మరో మూడు రోజుల్లో కూల్చివేత పూర్తి. శిథిలాల తొలగింపునకు కొన్ని వారాలు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూట్ మ్యాప్ ఖరారు. వారం పాటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.

బెల్లీ డాన్స్‌తో అదరగొట్టిన శ్రీదేవి డాటర్

, బెల్లీ డాన్స్‌తో అదరగొట్టిన శ్రీదేవి డాటర్

అందాల తార జాన్వీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. బ్యూటీలో శ్రీదేవికి ఏ మాత్రం తగ్గని జాన్వీ నటనలో తల్లి స్థాయిని అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.  ధడక్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తొలి ప్రయత్నమే ఆకట్టుకుంది. ధడక్ లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. అటుపై కెరీర్ పరంగా వెనుదిరిగి చూసే పనే లేకుండా దూసుకుపోతోంది. వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూ  హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దేశంలో తొలి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవితకథలో నటిస్తున్న జాన్వీ తదుపరి `తక్త్` అనే భారీ హిస్టారికల్ చిత్రంలో నటించనుంది. మరో హారర్ కామెడీ మూవీకి కూడా సైన్ చేసింది.

ఇక అందాన్ని, ఫిజిక్‌ను కాపాడుకోడానికి  రెగ్యులర్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుంది.  ఫిజికల్  ఫిట్ నెస్ తో పాటు పలు రకాల నృత్యాల్లోనూ శిక్షణ పొందుతోంది. తాజాగా జాన్వీ బెల్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని ప్రముఖ బాలీవుడ్ ఫోటో జర్నలిస్ట్  వైరల్ భయానీ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేశారు. కేవలం కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో నడుము ఊపులను ఎంతో అలవోకగా ప్రదర్శిస్తూ జాన్వీ అదరగొట్టేస్తోంది. ఇలానే కంటిన్యూ చేస్తే మున్ముందు జాన్వీతో మూవీ చేయడానికి ప్రొడ్యూసర్లు పోటీ పడాల్సిందేనేమో.

View this post on Instagram

 

#janhvikapoor belly dancing moves 🔥🔥🔥🔥

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Related Tags