“రియల్ హీరోస్‌”కి.. వినూత్న రీతిలో టీవీ9 నవ నక్షత్ర సన్మానం”

తెలుగు న్యూస్ ఛానెల్ చరిత్రలో టీవీ9 అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ప్రజల కష్టాలను తెలుసుకుని.. సమస్యలను తీర్చేందుకు అహరహమూ శ్రమించిన టీవీ9 తెలుగు న్యూస్ ఛానెల్.. ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో గత పదిహేనేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ.. వివిధ రాష్ట్రాల్లో విస్తరించింది. టీవీ9 వేసే ప్రతి అడుగు ప్రజలు చూపిందే. ప్రజల కష్టాన్ని తీర్చడం బాధ్యతగా భావించి.. క్షణక్షణం ప్రజలకు […]

రియల్ హీరోస్‌కి.. వినూత్న రీతిలో టీవీ9 నవ నక్షత్ర సన్మానం
Follow us

| Edited By:

Updated on: Dec 28, 2019 | 9:36 PM

తెలుగు న్యూస్ ఛానెల్ చరిత్రలో టీవీ9 అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ప్రజల కష్టాలను తెలుసుకుని.. సమస్యలను తీర్చేందుకు అహరహమూ శ్రమించిన టీవీ9 తెలుగు న్యూస్ ఛానెల్.. ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో గత పదిహేనేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ఒక్కో అడుగు ముందుకు వేస్తూ.. వివిధ రాష్ట్రాల్లో విస్తరించింది. టీవీ9 వేసే ప్రతి అడుగు ప్రజలు చూపిందే. ప్రజల కష్టాన్ని తీర్చడం బాధ్యతగా భావించి.. క్షణక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తోంది టీవీ9.

మెరుగైన సమాజం కోసం.. టీవీ9 పాటుపడుతుందని.. అదేసమయంలో సామాన్య ప్రజలకు భరోసాగా ఉంటుందని మాటిస్తోంది. టీవీ9 ఇండియాలో నెంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్‌గా ఎదిగేలా సహకరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్తోంది. ఈ నేపథ్యంలో మా ప్రతి నిర్ణయాన్ని ఆస్వాదించిన మీకోసం.. మనలో ఒకరిని మనకోసం ఒక్కొక్కరిని తొమ్మిది రంగాల నుంచి ఎన్నుకొని సత్కరించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

వైద్య సేవలో ఒకరైతే.. సమాజాన్ని ఉత్తేజ పరుస్తున్న వారు మరొకరు. అంతరిక్ష పరిశోధకులు ఒకరైతే.. విద్యలో విప్లవం తెచ్చింది ఇంకొకరు. ధైర్యానికి నిదర్శనం ఒకరైతే.. ఆదర్శానికి రూపం మరొకరు. కళా సేవలో మరొకరు. ఇలా తొమ్మిది రంగాల్లో.. సమాజాభివృద్ధికి తోడ్పడుతున్న వారిని మీకు పరిచయం చేస్తూ.. మీ తరఫున “టీవీ9 నవ నక్షత్ర” అవార్డుతో ఘనంగా సత్కరించింది. అయితే ఈ బృహత్తర కార్యక్రమాన్ని తొలుత టీవీ9 కన్నడ బెంగళూరులో మొదలుటపెట్టి.. అందరికీ ఆదర్శంగా నిలించింది టీవీ9. కన్నడలో మిన్నంటిన సంబరాల నడుమ ప్రేక్షకుల హర్షద్వానాలతో.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌లో.. “నవనక్షత్ర సన్మాన” కార్యక్రమం సాఫీగా సాగింది.

సమాజానికి సేవ చేయాలన్న సంకల్పం.. శిఖరమంత ఉంది. కానీ ప్రయత్నం ఎంత చేయాలో..? అని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ.. టీవీ9 రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతినిధుల నుంచి సమాచారం సేకరించింది. వివిధ రంగాల నిష్ణాతులను గుర్తించింది. అందులో ముఖ్యమైన వారిని ఎంపిక చేశారు. అయితే ఈ అందరిలో విజేతలు ఎవరు..? అనే ప్రశ్న దగ్గర సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో మా ఆహ్వానంతో మాకు అండగా నిలిచారు జ్యూరీ మెంబర్స్. వైద్య, విద్య, క్రీడా, సామాజిక వంటి 9 విభాగాల నుంచి విశిష్టమైన వ్యక్తులను, ఒక జీవిత సాఫల్య పురస్కార విజేతను, ఇంకా తగినంత గుర్తింపు పొందని అన్ సన్గ్ హీరోస్‌ని రెండు రాష్ట్రాల ప్రతినిధుల నుంచి సమాచారం సేకరించి టీవీ9. ఇందులో చాలా మందిని అర్హులుగా గుర్తించి అభ్యర్ధుల పేర్లను జ్యూరీ ముందు ఉంచింది టీవీ9.

ఈ బృహత్తర కార్యక్రమానికి జ్యూరీ సభ్యులుగా.. లోక్‌సత్త పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ. రామలింగేశ్వర రావు వ్యవహరించారు. వీరితో పాటుగా యాంటి చైల్డ్ లేబర్ యాక్టివిస్ట్, పద్మశ్రీ శాంతా సిన్హా.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేసన్ అండ్ జర్నలిజం ప్రోఫెసర్ కే. నాగేశ్వర్, ఐపీఎస్ ఆఫీసర్ ఏం.వీ. కృష్ణారావు కూడా జ్యూరీ మెంబర్స్‌గా ఉన్నారు. టీవీ9 కోర్ కమిటీ నిర్ణయించిన అన్ సర్గ్‌ హీరోస్ లిస్ట్‌తో ఏకీభవిస్తూ.. విభాగానికి ఒక విజేతను ప్రకటించారు జ్యూరీ మెంబర్స్.

ఈ చారిత్రక కార్యక్రమానికి హైదరాబాద్ హైటెక్ సిటీ వేదికగా మారింది. టీవీ9 నవనక్షత్ర సన్మానం 2019 కార్యక్రమానికి తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావ్‌తో పాటుగా.. మై హోం అధినేత రామేశ్వరరావు వేదికను పంచుకున్నారు. వీరితో పాటుగా పలువురు రాజకీయ నాయకులు, టాలీవుడ్ ప్రముఖులు, ప్రపంచం గర్వించదగ్గ తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విజేతలను ఒక్కొక్కరిగా ప్రకటిస్తుంటే కార్యక్రమానికి వచ్చిన అతిథులు హర్షద్వానాలతో పాటు.. ప్రాణాలకు తెగించిన అం సన్గ్ హీరోస్ గురించి వివరిస్తుంటే.. ప్రముఖులంతా ఆనంద బాష్పాలను రాల్చారు. టీవీ9 తెలుగు చేసిన ఈ నవ నక్షత్ర సన్మానం 2019కి హాజరైన ప్రతి ఒక్కరు మునెపెన్నడూ ఎరుగని ఉద్వేగంలో టీవీ9 కి థ్యాంక్స్ చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలకి మీ వెంట ఉంటామని భరోసా ఇచ్చారు.

తెలుగు మీడియా చరిత్రలో మునుపెన్నడూ లేని ఈ చారిత్మక కార్యక్రమం.. ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు ప్రారంభమవుతుంది. తెలుగు వారి గొప్పదనం, మానవత్వానికి దర్పణం, సమాజ శ్రేయస్సుని సదా అభిలషించే ఓ గొప్ప సంకల్పం కార్యక్రమాన్ని మీరు వీక్షించండి.