Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 2,07615. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 100303. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5,815. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు. 353, 427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీబీఐ. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం అతనిపై దాడి చేయడం, సెల్ ఫోన్ పగుల గొట్టడం, బెదిరింపులకు దిగినట్టు డాక్టర్ సుధాకర్ పై అభియోగాలు.
  • తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం కోర్టులో విచారణ ఏపీ నుంచి తెలంగాణ కి రిలీవ్ అయిన ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులం. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ లోని పని చేయాలని కోరుకుంటున్నామని తెలిపిన ఉద్యోగులు.
  • వైద్య కళాశాలలను భయపెడుతున్న కరోనా. హైదరాబాద్ లో మూడు వైద్య కళాశాలల్లో బయటపడిన కరోనా పాజిటివ్ కేసులు. కరోనా పాజిటివ్స్ లో ఎక్కువ మంది హాస్టల్ విద్యార్థులు . అత్యవసర చర్యలు చేపట్టిన వైద్య కళాశాలలు.
  • టీవీ9 తో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ 200 సయ్యద్ ఉమర్ జలీల్ లాక్‌డౌన్‌ నిబంధనల మధ్య జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. పరీక్షలు ఎలాంటి ఆటంకం లేకుండా జరిగాయి.
  • తీరం దాటుతున్న నిసర్గ తుఫాను. అలీబాగ్‌కు సమీపంలో తీరాన్ని తాకిన నిసర్గ. తీరాన్ని దాటేందుకు మరో గంట సమయం. ముంబై విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై నిషేధం. సాయంత్రం గం. 7.00వరకు నిషేధించిన అధికార యంత్రాంగం.

కొరడాతో కొట్టుకున్న సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

Salman Khan has shared a new video on Instagram in which he is seen whipping himself, కొరడాతో కొట్టుకున్న సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్
బాలీవుడ్ సూపర్ స్టార్..కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్‌ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు  ఆయనలో  హ్యూమనిటీ యాంగిల్‌ కూడా ఉంది. ‘బీయింగ్ హ్యూమన్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది అనాధలను చేరదీస్తున్నారు..వారి బాగోగులు చూసుకుంటున్నారు.  ఎంత షూటింగ్ బిజీలో ఉన్నా ‘బీయింగ్ హ్యూమన్’ కి వెళ్లి అక్కడి పిల్లలను ఆనందపరుస్తుంటారు.  ఇది సల్మాన్ ఖాన్ లోని ఒక కోణం..మరో కోణంలో ఆయన చాలా కోపిష్టి, ముక్కుసూటిగా వెళ్లే మనస్తత్వం గల మనిషి, సల్మాన్ పై ఇప్పటికే ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.
బాలీవుడ్ లో ఆయనకు ఎంతో మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, కొన్ని సార్లు హీరోయిన్లపై చేయి కూడా చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.  ఇక కృష్ణ జింక, హిట్ అండ్ రన్ కేసు లు గురించి కోర్టు చుట్టూ తిరిగిన విషయం తెలిసిందే. అయితే సల్మాన్ ఖాన్ ఏది చేసినా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్  అవుతుంది. తాజాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ పోతురాజు అవతారం ఎత్తాడు. అదేంటీ సల్మాన్ ఖాన్ కి పోతురాజుకీ సంబంధం ఏంటా అనుకుంటున్నారా?
పోతురాజు వేషధారణలో ఉన్న కొంతమందిని సల్మాన్ ఖాన్ ఇటీవల కలుసుకున్నాడు. వారితో కాసేపు ముచ్చటించిన భాయ్ అనంతరం వారి దగ్గర నుంచి కొరడా తీసుకొని సరదాగా తాను కూడా కొట్టుకున్నాడు. అనంతరం ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి వారితో గడిపి వారి బాధను తెలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు. అలాగే మీరు ఇలా ట్రై చేయకండి, ఎవరు మీద కూడా ప్రయోగించకండని సల్మాన్ పేర్కొన్నారు.  సల్మాన్ అలా చేయడం కొంత మందికి ఆశ్చర్యం వేసింది..మరికొంత మంది నవ్వుకున్నారు.  అయితే తన ఒంటిపై కొట్టుకున్నంత సేపు సల్మాన్ ముఖంలో చిరునవ్వే కనిపించింది. .. ఈ వీడియోను తన ఇన్ స్టా ఖాతా ద్వారా షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

 

View this post on Instagram

 

Thr is pleasure in feeling n sharing thr pain ahhhhhhhhhhhh Baccha party don’t try this on your self or on any 1 else

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Related Tags