ఆటోలో స్టార్ హీరోయిన్ షికారు..ఫ్యాన్స్ గుండె బేజారు!

Kabir Singh star Kiara Advani takes autorickshaw ride in Mumbai. Internet is in love, ఆటోలో స్టార్ హీరోయిన్ షికారు..ఫ్యాన్స్ గుండె బేజారు!

సూపర్ స్టార్ మహేశ్ నటించిన  ‘భరత్‌ అనే నేను’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ. అందం, అభినయంతో అదరగొట్టే ఈ భామ.. ముంబయి వీధుల్లో ఆటోలో చక్కర్లు కొట్టింది. కొరియోగ్రాఫర్‌ షబినా ఖాన్‌తో కలిసి ఆటోలో సిటీ అందాలను ఆస్వాదిస్తూ  షూటింగ్‌కు వెళ్లింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కియారా సో స్వీట్ అంటూ సోషల్ మీడియా రచ్చ చేస్తున్నారు. అయితే హిరోయిన్స్ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పు సరైన భద్రత అవసరం.

ఇక ఇటీవలే ‘కబీర్‌ సింగ్‌’తో మంచి హిట్‌ అందుకుంది కియారా. తెలుగు హిట్‌ ‘అర్జున్‌రెడ్డి’కి హిందీ రీమేక్‌ ఇది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.275 కోట్లకుపైగా రాబట్టింది. ప్రస్తుతం కియారా ‘గుడ్‌న్యూస్’, ‘లక్ష్మీబాంబ్‌’, ‘షేర్‌షా’, ‘మర్‌జావా’ తదితర ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *