సీఏఏకి వెరైటీ నిరసన.. బోట్లలో ‘వాటర్ మార్చ్’.. కేరళీయ కలర్

పౌరసత్వ చట్టానికి నిరసనగా దేశంలో ఇప్పటివరకు భారీ ర్యాలీలు, ప్రదర్శనలు చూశాం.. కానీ.. కేరళలో ప్రొటెస్ట్ చూస్తే వావ్  అనక మానం.. ఈ నెల 9 న కోజికోడ్ లోని చలియం అనే ప్రాంతంలో.. జంకర్ జెట్ట సెంటర్ నుంచి ఫెలోక్ బ్రిడ్జ్ వరకు స్థానికులు, మత్స్యకారులు నదిలో…  బోట్లలో ‘వాటర్ మార్చ్’ నిర్వహించారు. ఈ చట్టం వల్ల మనకు ప్రయోజనమేదీ లేదని, ఇది హానికరమని అంటూ ప్లకార్డులు, చిన్నపాటి పోస్టర్లు పట్టుకుని పడవలపై ‘ప్రయాణించారు’. కాగా-ఈ […]

సీఏఏకి వెరైటీ నిరసన.. బోట్లలో 'వాటర్ మార్చ్'.. కేరళీయ కలర్
Follow us

| Edited By:

Updated on: Jan 11, 2020 | 4:38 PM

పౌరసత్వ చట్టానికి నిరసనగా దేశంలో ఇప్పటివరకు భారీ ర్యాలీలు, ప్రదర్శనలు చూశాం.. కానీ.. కేరళలో ప్రొటెస్ట్ చూస్తే వావ్  అనక మానం.. ఈ నెల 9 న కోజికోడ్ లోని చలియం అనే ప్రాంతంలో.. జంకర్ జెట్ట సెంటర్ నుంచి ఫెలోక్ బ్రిడ్జ్ వరకు స్థానికులు, మత్స్యకారులు నదిలో…  బోట్లలో ‘వాటర్ మార్చ్’ నిర్వహించారు. ఈ చట్టం వల్ల మనకు ప్రయోజనమేదీ లేదని, ఇది హానికరమని అంటూ ప్లకార్డులు, చిన్నపాటి పోస్టర్లు పట్టుకుని పడవలపై ‘ప్రయాణించారు’. కాగా-ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కేరళ అసెంబ్లీ ఇటీవల ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి విదితమే.. పైగా సీఎం పినరయి విజయన్ పదకొండు బీజేపీయేతర రాష్ట్రాలకు లేఖను రాస్తూ.. తమ ప్రభుత్వం తీసుకున్న చర్య వంటి దాన్నే తీసుకోవాలని కోరారు.