కేరళ.. కోవిడ్-19 కాకున్నా పాజిటివ్ వైరస్ లక్షణాలు.. షాకింగ్ న్యూస్ !

కేరళలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు కనబడని ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్ రిపోర్టు రావడంతో అధికారులు షాక్ తిన్నారు. తిరువనంతపురానికి సుమారు 100 కి.మీ. దూరంలోని పథనంథిట్ట జిల్లాలో జరిగిందీ విచిత్రం ! దుబాయ్ నుంచి ఈ జిల్లాకు తిరిగి వఛ్చిన 60 ఏళ్ళ వ్యక్తికి, ఢిల్లీ నుంచి వఛ్చిన 19 ఏళ్ళ  ఓ  విద్యార్థినికి పాజిటివ్ రిపోర్టు వఛ్చినట్టు అధికారులు తెలిపారు. వారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ‘ఇది వార్నింగ్ సైన్ ! ఎలాంటి కరోనా ఛాయలూ […]

కేరళ.. కోవిడ్-19 కాకున్నా పాజిటివ్ వైరస్ లక్షణాలు.. షాకింగ్ న్యూస్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 07, 2020 | 8:03 PM

కేరళలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు కనబడని ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్ రిపోర్టు రావడంతో అధికారులు షాక్ తిన్నారు. తిరువనంతపురానికి సుమారు 100 కి.మీ. దూరంలోని పథనంథిట్ట జిల్లాలో జరిగిందీ విచిత్రం ! దుబాయ్ నుంచి ఈ జిల్లాకు తిరిగి వఛ్చిన 60 ఏళ్ళ వ్యక్తికి, ఢిల్లీ నుంచి వఛ్చిన 19 ఏళ్ళ  ఓ  విద్యార్థినికి పాజిటివ్ రిపోర్టు వఛ్చినట్టు అధికారులు తెలిపారు. వారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. ‘ఇది వార్నింగ్ సైన్ ! ఎలాంటి కరోనా ఛాయలూ కనబడని వీరిద్దరితో వేలాది అమాయక ప్రజలు కాంటాక్ట్ లోకి వఛ్చి ఉంటారని, వీళ్ళు 14 రోజులు క్వారంటైన్ లో గడిపినా ఎప్పుడూ తమకు ఏ శారీరక రుగ్మత లేనట్టే ఉన్నారని వారన్నారు. 60 ఏళ్ళ వ్యక్తి మార్చి 19 నుంచి ఈ నెల 6 వరకు క్వారంటైన్ లో ఉన్నాడని, ఇక 19 ఏళ్ళ విద్యార్థిని మార్చి 15 న ఢిల్లీ నుంచి రైల్లో వచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆమె మార్చి 17 న బస్సులో ఎర్నాకుళం జిల్లాకు వచ్చింది. అయితే స్వల్ప జ్వరం కారణంగా క్వారంటైన్ లో ఉంటూ.. ఈ నెల 4 న ఆసుపత్రిలో చేరగా అప్పుడే పాజిటివ్ లక్షణాలు కనబడ్డాయని ఆయన చెప్పారు. ఈ ఇద్దరూ ఎక్కడెక్కడ తిరిగారో, రూట్ మ్యాప్, ట్రావెల్ డేట్స్, వగైరా వివరాలను  అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేరళలో 327 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా.. 58 మంది కోలుకున్నారు.

కాగా చైనాలో కూడా ఎలాంటి కరోనా రోగమూ కనబడని ఐదుగురువ్యక్తులకు కూడా పాజిటివ్ రిపోర్టు వఛ్చిన విషయం గమనార్హం.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..