వారికి దూరంగా ఉండలేను.. బిగ్‌బాష్ లీగ్‌ ఆడనని తేల్చిచెప్పిన వార్నర్

బయోబబుల్‌లో ఉంటూ క్రికెట్‌ ఆడటం వల్ల కుటుంబానికి ఎంతో దూరమవుతున్నానని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ అన్నారు. గత ఆరు నెలలు ఎంతో కఠినంగా గడిచాయని అన్నారు.

  • Sanjay Kasula
  • Publish Date - 10:53 pm, Mon, 23 November 20
వారికి దూరంగా ఉండలేను.. బిగ్‌బాష్ లీగ్‌ ఆడనని తేల్చిచెప్పిన వార్నర్

until he announces : బయోబబుల్‌లో ఉంటూ క్రికెట్‌ ఆడటం వల్ల కుటుంబానికి ఎంతో దూరమవుతున్నానని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ అన్నారు. గత ఆరు నెలలు ఎంతో కఠినంగా గడిచాయని అన్నారు. అయితే ప్రస్తుతం రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లపై దృష్టిసారిస్తున్నాని తెలిపాడు.

వచ్చే ఏడాది భారత్‌లో, 2021లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లకు సన్నద్ధమవుతున్నట్లు వార్నర్‌ పేర్కొన్నాడు. దానికి తగ్గట్లుగా ఆటగాళ్లు, కోచ్‌ సిబ్బందిని గుర్తించామని తెలిపారు.

వచ్చే టీ20 ప్రపంచకప్‌పై ప్రత్యేక సాధన చేస్తున్నామని వెల్లడించిన వార్నర్.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే వరకు బిగ్‌బాష్ లీగ్‌ ఆడనని వార్నర్‌ చెప్పుకొచ్చాడు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న ఆటగాళ్లకు కాస్త విరామం ఉండాలని, అందుకే దూరమవ్వాలనుకున్నానని స్పష్టం చేశాడు. అంతేగాక తన ముగ్గురు పిల్లలకు, భార్యకు సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నాని తెలిపాడు.