‘బుట్టబొమ్మ’ను మరిచిపోలేక పోతున్న వార్నర్… బన్నీకి మరోసారి వెల్ డన్ చెప్పిన

బుట్టబొమ్మతో తెలుగు ప్రజలకు దగ్గరైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథి వార్నర్.. మరోసారి ట్వీట్ చేశాడు. అల వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మ' పాట, మరో మైలురాయిని అందుకుంది.

'బుట్టబొమ్మ'ను మరిచిపోలేక పోతున్న వార్నర్... బన్నీకి మరోసారి వెల్ డన్ చెప్పిన
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Nov 24, 2020 | 6:12 PM

david warner butta bomma : బుట్టబొమ్మతో తెలుగు ప్రజలకు దగ్గరైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథి వార్నర్.. మరోసారి ట్వీట్ చేశాడు. అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాట, మరో మైలురాయిని అందుకుంది. మంగళవారం 450 మిలియన్ల మార్క్​ను అధిగమించింది. ఈ నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్ వార్నర్​.. వెల్​డన్ అల్లు అర్జున్ అని ఇన్​స్టాలో పోస్ట్ పెట్టాడు.

‘బుట్టబొమ్మ’ సాంగ్‌పై స్టెప్పులేసిన వార్నర్​ ఫ్మామిలీ తెలుగు ప్రజల్లో కలిసిపోయింది. లాక్​డౌన్​లో ఆటలన్నీ నిలిచిపోవడం వల్ల క్రికెటర్లందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆ సమయంలో టిక్​టాక్​లు చేస్తూ అభిమానులకు వార్నర్ కుటుంబం దగ్గరయ్యింది.

ఈ క్రమంలోనే ‘బుట్టబొమ్మ’, ‘మైండ్​బ్లాక్’ లాంటి తెలుగు పాటలకు డ్యాన్స్​ చేసి టాలీవుడ్​ ఫ్యాన్స్​ కూడా చేరువయ్యారు. ఇటీవల ఐపీఎల్​లో తమ జట్టు ఫైనల్​కు వెళ్తే ‘బుట్టబొమ్మ’​ స్టెప్పు వేస్తానని వార్నర్​ ఓ నెటిజన్​ కామెంట్​కు రిప్లై  ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ హైదరాబాద్​ జట్టు క్వాలిఫయర్​-2లో ఓడి ఇంటిముఖం పట్టింది. దీంతో వార్నర్​ అభిమానులు నిరాశ చెందారు.