వార్నర్ మెరిసే.. సన్‌రైజర్స్ మురిసే

వార్నర్ మెరుపు ఇన్నింగ్స్ రాణించిన బౌలర్లు  రాహుల్ మెరుపులు వృధా వరుసగా రెండు ఓటములతో ప్లే‌ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సన్‌రైజర్స్ మళ్ళీ రేస్‌లోకి వచ్చింది. భీకరమైన ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్.. ఈ సీజన్‌లో ఆడుతున్న తన ఆఖరి మ్యాచ్‌లోనూ అదరగొట్టి.. తన జట్టుకు కీలక విజయాన్ని అందించి ఐపీఎల్ 12కు వీడ్కోలు పలికాడు. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 45 పరుగులు తేడాతో ఘన విజయం […]

వార్నర్ మెరిసే.. సన్‌రైజర్స్ మురిసే
Follow us

|

Updated on: Apr 30, 2019 | 1:15 PM

    • వార్నర్ మెరుపు ఇన్నింగ్స్
    • రాణించిన బౌలర్లు 
    • రాహుల్ మెరుపులు వృధా

వరుసగా రెండు ఓటములతో ప్లే‌ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న సన్‌రైజర్స్ మళ్ళీ రేస్‌లోకి వచ్చింది. భీకరమైన ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్.. ఈ సీజన్‌లో ఆడుతున్న తన ఆఖరి మ్యాచ్‌లోనూ అదరగొట్టి.. తన జట్టుకు కీలక విజయాన్ని అందించి ఐపీఎల్ 12కు వీడ్కోలు పలికాడు. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 45 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (81; 56 బంతుల్లో 7×4, 2×6) మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో షమీ (2/36), అశ్విన్ (2/30), అర్షదీప్ (1/42) రాణించారు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ రాహుల్ (79; 56 బంతుల్లో 4×4, 5×6) పోరాడినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లు ఖలీల్‌ (3/40), రషీద్‌ఖాన్‌ (3/21) పంజాబ్‌ను దెబ్బతీశారు. దీంతో వరుసగా మూడు మ్యాచులలో ఓటమిపాలైన పంజాబ్ ప్లే‌ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కాగా డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.