వార్నర్ లేని పోరాటానికి సిద్ధమైన సన్‌రైజర్స్

ఐపీఎల్‌లో భాగంగా వార్నర్‌ లేని సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. ప్లేఆఫ్‌ బెర్తు లక్ష్యంగా కీలక సమరానికి సిద్ధమవుతోంది. ముంబయి వేదికగా ఈ రోజు ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం చేసుకోవడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ ఖచ్చితంగా కీలకమే. పాయింట్ల పరంగా చూస్తే ప్రస్తుతం సన్‌రైజర్స్‌ కంటే ముంబయి ఇండియన్స్‌ మెరుగైన స్థానంలోనే ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ముంబయి విజయం సాధిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్‌ బెర్తు ఖరారైనట్లే. అయితే హైదరాబాద్‌ […]

వార్నర్ లేని పోరాటానికి సిద్ధమైన సన్‌రైజర్స్
Follow us

| Edited By:

Updated on: May 02, 2019 | 7:42 PM

ఐపీఎల్‌లో భాగంగా వార్నర్‌ లేని సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. ప్లేఆఫ్‌ బెర్తు లక్ష్యంగా కీలక సమరానికి సిద్ధమవుతోంది. ముంబయి వేదికగా ఈ రోజు ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం చేసుకోవడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ ఖచ్చితంగా కీలకమే. పాయింట్ల పరంగా చూస్తే ప్రస్తుతం సన్‌రైజర్స్‌ కంటే ముంబయి ఇండియన్స్‌ మెరుగైన స్థానంలోనే ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ముంబయి విజయం సాధిస్తే 16 పాయింట్లతో ప్లేఆఫ్‌ బెర్తు ఖరారైనట్లే. అయితే హైదరాబాద్‌ మాత్రం తర్వాతి మ్యాచ్‌లో తప్పక గెలిచి.. కోల్‌కతా, పంజాబ్‌ విజయాలపైన ఆధారపడాల్సి వస్తుంది.