తూర్పుగోదావరిలో మరో హాస్టల్ భాగోతం..

హాస్టళ్లలో జరుగుతున్న అరాచకాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హాస్టళ్ల నిర్వాహణపై ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి. తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం లక్షలు వెచ్చించి పిల్లల్ని హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్న తల్లిదండ్రులకు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.

తూర్పుగోదావరిలో మరో హాస్టల్ భాగోతం..
Follow us

|

Updated on: Feb 28, 2020 | 7:53 PM

హాస్టళ్లలో జరుగుతున్న అరాచకాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లోని పలు హాస్టళ్ల నిర్వాహణపై ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి. తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం లక్షలు వెచ్చించి పిల్లల్ని హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్న తల్లిదండ్రులకు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. ఇటీవల బయటపడ్డ గర్ల్స్ హాస్టల్ వివాదం మరువక ముందే..తాజగా తూర్పుగోదావరి జిల్లాలో మరో హాస్టల్ సిబ్బంది నిర్వాకం బయటపడింది.

జిల్లాలోని అనపర్తి మండలం పులగుర్త రామకోట బాలుర వసతి గృహంలో దారుణం చోటు చేసుకుంది. నలుగురు అబ్బాయిలు హాస్టల్ లోనే దొంగతనాలకు పాల్పడుతున్నారనే అభియోగంతో యజమాని వారిపై దాష్టీకం ప్రదర్శించాడు. అనుమానం వ్యక్తం చేస్తూ..ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్న యజమాని చావచితకబాదాడు. యజమాని కొట్టిన దెబ్బలకు బాలుడి ఒళ్లంతా కందిపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. జరిగిన ఘటనపై సిబ్బందిని నిలదీశారు.అయితే, విద్యార్థులు దొంగతనాలకు పాల్పడుతున్నారని, సిగరెట్ల అలవాటుతో పాటు చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని, అందుకే కొట్టానని చెప్పాడు.

ఇదిలా ఉంటే స్థానికులు, విద్యార్థులు మాత్రం నిర్మాహకులపై ఆరోపణలు చేస్తున్నారు. గతంలో 60 మందికి పైగా ఉండే హాస్టల్లో..ఇప్పడు 10 మంది విద్యార్థులతో నడుపుతున్నారని చెప్పారు. తల్లదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెడు దారిలో వెళ్తున్న పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించాలని చెప్పారు. అంతేగానీ, విచక్షణారహితం కొట్టడం నేరంగా వివరించారు.