Municipality Elections: వరంగల్, ఖమ్మం మునిసిపాలిటీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా.. ప్రత్యేక అధికారుల పాలన తప్పదా..

Municipality Elections: వరంగల్, ఖమ్మం మునిసిపాలిటీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా

Municipality Elections: వరంగల్, ఖమ్మం మునిసిపాలిటీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా.. ప్రత్యేక అధికారుల పాలన తప్పదా..
Follow us

|

Updated on: Jan 05, 2021 | 3:27 PM

Municipality Elections: వరంగల్, ఖమ్మం మునిసిపాలిటీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా పాలకవర్గం గడువు ముగిసే సమయానికి మూడు నెలల ముందే ఎన్నికల కసరత్తు ప్రారంభించాల్సి ఉంది కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు ప్రారంభించలేదు. ఈ రెండు మునిసిపాలిటీలకు గడువు ముగిసిన తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఈ రెండు మునిసిపాలిటీల గడువు మార్చి 14వ తేదీ వరకు ఉంది. ఈలోపు కేంద్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా విడుదల చేయడం, వార్డుల పునర్ వ్యవస్థీకరణ, రిజర్వేషన్ల ఖరారు వంటివి జరగాల్సి ఉంది. అయితే ఇవన్ని ఇప్పుడు గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటాయి. అవసరమైతే ప్రత్యేకాధికారుల పాలన విధిస్తుంది. మరోవైపు ప్రభుత్వం నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత స్థానిక సంస్థలు నిర్వహించే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ రెండు మునిసిపాలిటీ ఎన్నికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకిల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున అన్ని కలిపి ఒక్కసారి నిర్వహించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గడువు ప్రకారమే మునిసిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తారనే ఉద్ధశ్యంతో బీజేపీ లాంటి రాజకీయ పార్టీలు ఇప్పటికే ఖమ్మం, వరంగల్‌లో క్షేత్ర స్థాయి ప్రచారం షురూ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఎన్నికల విషయంలో తొందరపాటుగా వ్యవహరించొద్దని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని చదవండి:

Ap Municipalities: ఏపీలో మున్సిపాలిటీల పరిధి పెంపు.. మరో కొత్త మున్సిపాలిటీ.. ఐదు నగర పంచాయతీలు

Bigg Boss Sohel : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసిన సోహెల్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో