కన్నులపండువగా భద్రకాళి తెప్పోత్సవం

 Bhadrakali Ammavari Teppotsavam : వరంగల్‌లో దేవీశరన్నరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో చివరి రోజున జరిగిన తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవాల్లో శ్రీ భద్రకాళి అమ్మవారికి విజయదశమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, నిజరూప దర్శనంతో భక్తులు తన్మయత్వం చెందారు. సాయంత్రం భద్రకాళి చెరువులో అర్చకులు అమ్మవారికి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం రాత్రి నిర్వహించిన తెప్పోత్సవ కార్యక్రమం కన్నులపండువగా సాగింది. కొవిడ్‌ నిబంధనల మేరకు భక్తలను తెప్పోత్సవానికి అనుమతించలేదు. […]

  • Sanjay Kasula
  • Publish Date - 12:04 am, Mon, 26 October 20

 Bhadrakali Ammavari Teppotsavam : వరంగల్‌లో దేవీశరన్నరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో చివరి రోజున జరిగిన తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవాల్లో శ్రీ భద్రకాళి అమ్మవారికి విజయదశమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, నిజరూప దర్శనంతో భక్తులు తన్మయత్వం చెందారు.

సాయంత్రం భద్రకాళి చెరువులో అర్చకులు అమ్మవారికి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం రాత్రి నిర్వహించిన తెప్పోత్సవ కార్యక్రమం కన్నులపండువగా సాగింది. కొవిడ్‌ నిబంధనల మేరకు భక్తలను తెప్పోత్సవానికి అనుమతించలేదు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.